Health

నోరూరించే హలీం తింటున్నారా..! ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

ఈ రంజాన్ సమయంలో ఎక్కడ చూసినా హలీమ్ సెంటర్‎లు కనిపిస్తాయి. నోరూరించే హలీం తినేందుకు చిన్నా, పెద్ద ఎంతో ఆసక్తిగా ఉంటారు. ఇది చాలా రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. రోజంతా ఉపవాసం ఉండటం వల్ల హలీం తింటే తిరిగి పొందవచ్చని చెబుతారు. ఎంతో మంది ఇష్టం తినే ఈ హలీంని అరేబియన్స్ తీసుకువచ్చారు. హలీంని హరీస్ అని పిలుస్తారు. అయితే హలీమ్ అంటే ఏంటి.. మటన్, బీఫ్, చికెన్ తో హలీమ్ తయారు చేస్తారు. చూసేందుకు పేస్ట్ లాగా మెత్తగా ఉంటుంది.

ఇందులో ఉపయోగించే పదార్థాలన్నింటిలోనూ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గోధుమలు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, శనగపప్పు, మినపప్పు, వేస్తారు. ఇవే కాదు మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, వామ్ము, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, నల్ల మిరియాలు, కుంకుమ పువ్వు, బెల్లంతో పాటు డ్రై ఫ్రూట్స్ పిస్తా, జీడిపప్పు, అంజీరా, బాదం పప్పు వేస్తారు. గ్రేవీగా ఉండే వేడి వేడి హలీమ్ చూస్తే ఎవరికైనా నోరూరిపోతుంది. దాని మీద కొత్తిమీర, ఫ్రైడ్ ఉల్లిపాయలు, నిమ్మకాయ ముక్క వేసి గార్నిష్ చేసి ఇస్తారు.

ఎలా చేస్తారు.. హలీమ్ చేసేందుకు ఎక్కువ సమయం పడుతుంది. గోధుమలు, పప్పులు రాత్రంతా నానబెట్టి బాగా ఉడికించుకుని పెట్టుకోవాలి. మటన్ కూడా ఖైమా లాగా చేసుకుని ఉడికించుకోవాలి. అన్ని రకాల మసాలాలు వేసిన తర్వాత గ్రేవీ మాదిరిగా రావడం కోసం బాగా ఉడికిస్తారు. ఎంత ఎక్కువగా ఉడికిస్తే రుచి అంత అద్భుతంగా ఉంటుంది. సన్నని మంట మీద ఉడికించడం వల్ల హలీమ్ వండటానికి కనీసం 6-7 గంటల సమయం పడుతుంది.

హలీమ్ ఆరోగ్యకరమేనా.. కేలరీలు అధికంగా ఉండే హలీమ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది తక్షణమే శరీరానికి శక్తినిస్తుంది. ఇందులోని పీచు పదార్థం కారణంగా నెమ్మదిగా జీర్ణం అవుతుంది. అందువల్ల పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ చేర్చడం వల్ల శరీరానికి చాలా మేలు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి.

మటన్, డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం. గోధుమలు ఉపయోగించడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. దీని తయారీకి ఉపయోగించే మసాలా దినుసుల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు, కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మధుమేహంతో బాధపడే వారికి చక్కని ఆహారమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker