తలకు నూనె పెట్టుకునేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే చాలు మిమ్నల్ని ఎవరు కాపాడలేరు.
కొబ్బరినూనెను చాలా మంది జుట్టుకు అప్లై చేస్తారు. ఈ నూనెలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొబ్బరి నూనె ఫ్యాటీ యాసిడ్స్ పవర్‌హౌస్. ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది, జుట్టుకు తేమను అందించి సిల్కీగా మారుస్తుంది. అయితే జ్యోతిష్య పండితులు తలకు నూనెను ఎప్పుడు పెట్టుకోవాలి, అదే విధంగా ఎప్పుడు పెట్టుకొకూడదో వివరించారు.
కొన్ని వారాల్లో తలకు నూనె పెట్టుకొవడం పూర్తిగా నిషేధించినదిగా చెప్పుకొవచ్చు. శుక్రవారం ను మంగళకర వారమని భావిస్తుంటారు. అదే విధంగా శుక్రవారం రోజున నూనె పెట్టుకుంటే అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంటుందని కూడా పండితులు చెబుతుంటారు. ఇంట్లో లేని పోని సమస్యలు ఏర్పడతాయి.
ఇక గురువారం రోజున కూడా నూనెను పెట్టుకొవడం అంతమంచిది కాదని చెబుతుంటారు. గురువు గ్రహం ప్రభావం కారణంగా కూడా నూనెను పెట్టడం అంతమంచిదికాదని భావిస్తుంటారు. రాత్రి సమయంలోకూడా నూనె పెట్టుకుని పడుకోవడం వలన జుట్టంతా జిగటగా మారిపోతుంది.
అంతే కాకుండా..పక్కబట్టలు, దిండు కవర్ కూడా ఆయిల్ మరకలతో చూడటానికి అంత బాగుండవు. శనివారం రోజున కూడా నూనెను పెట్టుకొవద్దని చెబుతుంటారు. శనిదేవుడికి తైలం అంటే ఎంతో ప్రీతి. నల్ల నువ్వులు, తైలం తో శనిదేవుడికి అభిషేకం చేస్తుంటారు.
అందుకే శనివారం రోజునమాత్రం ఎట్టి పరిస్థితిల్లో కూడా నూనె పెట్టుకొవద్దని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. అదే పుట్టిన రోజున నూనె పెట్టుకుని అభ్యంగన స్నానంచేస్తే సకల దోషాలు వెళ్లిపోతాయి. అదే విధంగా మిగతా కొన్నివారాల్లో తలకు నూనె రాసుకోవడం వలన చెడు ఫలితాలుండవని సమాచారం.