జుట్టుకు ముల్తానీ మట్టి రాసి వాష్ చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
వర్షాకాలంలో గిరజాల జుట్టు చిక్కుకుపోయి నిర్జీవంగా మారుతుంది. వర్షాకాలం జుట్టు అందాన్ని దూరం చేస్తుంది. ఈ సీజన్‌లో జుట్టును ఎక్కువసేపు తెరచి ఉంచితే జుట్టు మీద వేడి, దుమ్ము, తేమ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, కర్ల్స్ పొడిగా, నిర్జీవంగా మారతాయి. ఒకదానితో ఒకటి చిక్కుకోవడం ప్రారంభిస్తాయి. బలహీనమైన జుట్టు జుట్టు రాలడానికి కారణమవుతుంది. అయితే ముల్తానీమట్టిని కేవలం ముఖ సౌందర్యానికే పరిమితం చేయనక్కర్లేదు.
దీనివల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. దీన్ని కొన్ని పదార్థాలతో కలుపుకొని పూతలా వేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. జుడ్డు జిడ్డుగా మారి అంటుకున్నట్లుగా ఉంటే.. ముల్తానీమట్టిలో గుడ్డులోని తెల్లసొనను వేరుచేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. గంటపాటు అలానే ఉంచాలి. తలస్నానం చేయడానికి బకెట్‌లో నింపుకున్న నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుంటే గుడ్డు వాసన రాకుండా ఉంటుంది.
గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఎక్కువరోజులు జిడ్డుగా మారకుండా ఉంటుంది. ముల్తానీమట్టిలో కొంచెం పెరుగు, నువ్వులనూనె వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 60 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే జుట్టు రాలిపోకుండా ఒత్తుగా పెరుగుతుంది. కొంతమందికి తలస్నానం చేసిన రెండురోజులకే జుట్టుగా మారిపోతుంది.
అలాంటివారు ముల్తానీమట్టిలో నీళ్లు కలుపుకొని తలకు రాసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే దీన్ని తరుచుగా మాత్రం చేయకూడదు. ఎక్కువగా మాడులో సహజంగా ఉండే నూనెలు విడుదలవ్వవు. చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొన్ని మెంతులను రాత్రంతా నానబెట్టి ముద్దలా తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమంలో కాస్త ముల్తానీమట్టిని కలుపుకొని తలకు రాసుకోవాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు నుంచి విముక్తి చెందవచ్చు.