Health

H3N2 వైరస్ సోకినా వారి కిడ్నీలపై తీవ్ర ప్రమాదం, వైద్య నిపుణులు ఏం చెప్పారంటే..?

కొత్తగా ‘ఇన్‌‌‌‌ఫ్లుయెంజా’ భయపెడుతోంది. ఎన్నడూ లేనిది ఈ ఏడాది కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ‘హెచ్‌‌‌‌3ఎన్‌‌‌‌2’ కారణంగా దేశంలో ఇద్దరు చనిపోవడంతో కరోనా మాదిరి ఈ వైరస్ కూడా వ్యాపిస్తుందా? అనే ఆందోళన ప్రజల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో ఇన్‌‌‌‌ఫ్లుయెంజా వైరస్‌‌‌‌పై ఆందోళన చెందాల్సిన పని లేదని మెడికల్ ఎక్స్‌‌‌‌పర్టులు సూచిస్తున్నారు. అయితే కోవిడ్-19 తరువాత హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా కేసులు దేశంలో పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ ఇన్‌ఫ్లుయెంజా దేశంలో ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. ఇది తేలికపాటి వ్యాధి అని గుర్తించినా, అనారోగ్యంగా ఉన్న వారికి తీవ్ర ముప్పు తెచ్చిపెడుతుంది.

హెచ్‌3ఎన్‌2 ఇతర ఇన్‌ఫ్లుయెంజా వ్యాధులతో పోలిస్తే ఎక్కువ తీవ్రత కలిగిన ఇన్‌ఫ్లుయెంజా. ఆసుపత్రిలో చికిత్స అవసరం అవుతుంది. కోవిడ్ తరహా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వల్ల ఈ హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వ్యాప్తి ఆగిపోతుంది. ఈ వైరస్ శిశువులు, చిన్నారుల్లో పెరిగిపోతోంది. చాలా కేసుల్లో ఐసీయూ అవసరం అవుతుంది. ముఖ్యంగా చిన్నారుల్లో శ్వాస ఆడకపోవడం, దగ్గు, జ్వరం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తున్నట్టు నివేదికలు అందుతున్నాయి.

కాగా హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా కిడ్నీలపై పెను ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్దుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యాలైన డయాబెటిస్, హైపర్‌టెన్షన్, గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ‘ఫ్లూ వైరస్‌గా పేరున్న ఇన్‌ఫ్లుయెంజా కిడ్నీలపై విభిన్న దుష్ప్రభావాలు చూపిస్తుంది. ఇన్‌ఫ్లుయెంజా వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైన వారిలో కిడ్నీ ఫెయిలయ్యే ముప్పు ఉంది. 30 శాతం కేసుల్లో ఇలా జరిగేందుకు ఆస్కారం ఉంది.

వయస్సు పైబడిన పేషెంట్లలో, ముఖ్యంగా దీర్ఘకాలికంగా డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కార్డియాక్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు కలిగి ఉన్న వారిలో ఈ ముప్పు ఎక్కువగా ఉంది. కిడ్నీ మార్పిడి పేషెంట్లు, డయాలిసిస్ చేయించుకుంటున్న పేషెంట్లలో ఈ ముప్పు ఇంకా ఎక్కువగా ఉంటుంది. వీరిలో సెకండరీ బ్యాక్టీరియల్ న్యూమోనియా, విభిన్న అవయవాల్లో సంక్లిష్టతలు చోటు చేసుకుంటాయి. గుండె కూడా పనిచేయకుండా పోవచ్చు.

సాధారణ ప్రజల కంటే వీరు ఎక్కువగా మరణాల బారిన పడాల్సి రావొచ్చు..’ అని అకార్డ్ హాస్పిటల్ యూరాలజీ డాక్టర్ సౌరభ్ జోషి చెప్పారు. అకస్మాత్తుగా హై ఫీవర్ రావడం, దగ్గు, గొంతులో నొప్పి, తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఈ హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజాలో కనిపిస్తాయి. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు శ్వాస ఆడకపోవడం, తీవ్రంగా వాంతులు రావడం, శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం, లో బ్లడ్ ప్రెషర్, గందరగోళం, చాతీలో నొప్పి, ఆక్సిజన్ సాచ్యురేషన్ తక్కువగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker