News

కరోనా లాగా వ్యాపిస్తున్న హెచ్3ఎన్2 వైరస్, కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ICMR.

ప్రస్తుతం మనం ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరగడాన్ని చూస్తున్నాం. ఏటా ఈ టైంలో ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతుంటుంది. దీని వల్ల జ్వరం, దగ్గు, గొంతులో గరగర, ఒళ్లు నొప్పులు, జలుబు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే..ఈ వైరస్ ఏటా మార్పులకు లోనవుతుంది. దీన్ని యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అంటారు. కొన్నేళ్ల క్రితం హెచ్1ఎన్1 వైరస్‌తో సంక్షోభం వచ్చింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నది హెచ్3ఎన్2 రకం వైరస్. ఇది సాధారణ ఫ్లూ వేరియంటే. అయితే వైరస్ తరచూ మార్పులకు లోనై రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోగలుగుతోంది.

దీంతో.. కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ వైరస్ గాల్లో తుంపర్ల ద్వారా వ్యాపిస్తోంది. అయితే..ఇదేమంత ఆందోళనకరమైన అంశం కాదు. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యలో భారీ పెరుగుదల లేదు్ణ్ణ అని డా. గులేరియా వివరించారు. వాతావరణ మార్పుల కారణంగా హెచ్3ఎన్2 సహజంగానే మార్పులకు లోనవుతుంటుందని చెప్పుకొచ్చారు.ప్రజల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి అలవాట్లు తగ్గడంతో ఇన్‌ఫ్లుయెంజా కేసుల సంఖ్య పెరుగుతోందని ఆయన చెప్పారు.

అయితే చాలా రోజుల తర్వాత భారత దేశాన్ని మరో కొత్త వైరస్ వణికిస్తోంది. సాధారణ ఫ్లూకి భిన్నంగా కొత్త ఫ్లూ దేశ ప్రజలను గజ గజా వణికిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాలను సైతం కొత్త ఫ్లూ భయపెట్టిస్తోంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ఇరు రాష్ట్రాలను ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ తాజాగా హై అలెర్ట్ జారీ చేసింది. ఇన్‌ఫ్లూయెంజా H3N2 వైరస్ తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తోంది. పైకి కరోనా లాంటి లక్షణాలు కన్పిస్తున్నా..కరోనా మాత్రం కాదు.

ఈ వైరస్ ప్రభావంతో ప్రస్తుతం ప్రతీ ముగ్గురిలో జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు కన్పిస్తున్నాయి. దేశంలో ఇలాంటి లక్షణాలతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. వైరల్ ఫీవర్‌ పేషంట్లతో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. చాలా మందిలో ఇవి తీవ్రంగా..దీర్ఘకాలికంగా ఉంటున్నాయి. కొందరిలో జ్వరం మాదిరిగా స్టార్ట్ అయి..ఆ తర్వాత అది న్యూమోనియాగా మారి శ్వాసకోశ ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ICMR కీలక మార్గదర్శకాలను జారీచేసింది.

వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకునే ప్రయత్నాలపై దృష్టి సారించాలని కోరింది. మరీ ముఖ్యంగా వైద్యులను సంప్రదించకుండా యాంటీ బయాటిక్స్ వాడకూడదని దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు ఇన్‌ఫెక్షన్లను నిర్థారించుకోకుండా యాంటీ బయోటిక్స్ పేషంట్లకు సూచించకూడదని అటు వైద్యులను కూడా ICMR హెచ్చరించింది. ఈ ఫ్లూ నుంచి కోలుకున్నాక కూడా దీర్ఘ కాలిక ప్రభావం ఉండొచ్చని..ఈ వైరస్‌తో ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్తోంది. కోవిడ్ తర్వాత ఇన్‌ఫ్లూయెంజా H3N2 వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker