ఆరోగ్యమని గ్రీన్ టీ తాగుతున్నారా.? ఆరోగ్యనికి ఎంత ప్రమాదమో తెలుసుకోండి.
ఆరోగ్యంగా ఉండొచ్చని గ్రీన్ టీ తీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టీని కనీసం ప్రాసెస్ చేయకుండా తయారు చేస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు దరిచేరవు. కొందరు రోజులో ఒక కప్పు మాత్రమే గ్రీన్ టీ తాగుతారు. అలాగే మరికొందరు రోజుకు ఐదు కప్పులకు మించి తాగుతారు. అయితే గ్రీన్ టీ అధికంగా సేవించడం వల్ల తలనొప్పి, నీరసం, బద్ధకం, చిరాకు వంటివి కలుగుతాయి.
గ్రీన్ టీ అందరూ తీసుకోవడం కూడా మంచిది కాదు. వైద్యుల సూచన మేరకే గ్రీన్ టీ తీసుకోవాలి. ఎందుకంటే గ్యాస్ ఎసిడిటీ , కెఫీన్ అలర్జీ ఉన్నవారికి గ్రీన్ టీ అంత మంచిది కాదు. మితంగా తీసుకోవాలి. గ్రీన్ తాగినప్పుడు ఏదైనా సమస్యగా అన్పిస్తే మానేయడం మంచిది. గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. అంతే కాకుండా.. ఆకలి కూడా క్రమంగా తగ్గిపోతుంది. దీని వల్ల మీ శరీరం బలహీనంగా మారుతుంది. అతిగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
శారీరక ఆరోగ్యం కోసం నిద్ర చాలా ముఖ్యం. గ్రీన్ టీని మితంగా తీసుకోవడం వల్ల నిద్రకు భంగం వాటిల్లే అవకాశం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉదయాన్నే గ్రీన్ టీ తాగే ముందు ఏదైనా తింటే శ్రేయస్కరం. గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. గ్రీన్ టీలోని కెఫిన్ మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
మధుమేహంతో బాధపడుతున్నవారు గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల దురదలు, ఆందోళన, గుండెల్లో మంట ఏర్పడే అవకాశం ఉంది. గర్భంతో ఉన్నవారు గ్రీన్ టీని అతిగా తాగొద్దు. ఇందులోని కెఫీన్ ఉద్దీపన రక్తంలోకి చాలా సులభంగా చేరుకుంటుంది. దీనివల్ల శిశువుల్లో జీవక్రియ సమస్యలు ఏర్పడవచ్చు. ఇది ప్రేగులలోని ప్రోటీన్ మొత్తాన్ని తగ్గిస్తుంది.
దీంతో వాంతులు, వికారం సమస్యలు ఉంటాయి. ఎముకలను బలహీనం చేస్తుంది. బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. గ్రీన్ టీ ఖాళీ కడుపుతో త్రాగినప్పుడు కడుపులో చికాకు కలిగించవచ్చు. గ్రీన్ టీలో టానిన్లు ఉంటాయి, ఇవి కడుపులో యాసిడ్ మొత్తాన్ని పెంచుతాయి. అధిక ఆమ్లం మలబద్ధకం, యాసిడ్ రిఫ్లక్స్, వికారంతో సహా జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. గ్రీన్ టీని ఎక్కువ మోతాదులో తీసుకుంటే విరేచనాలు కూడా కలుగుతాయి. మీరు ప్రకోప ప్రేగు సిండ్రోమ్‌తో బాధపడుతుంటే, గ్రీన్ టీని నివారించండి.