Health

పచ్చి బాదంపప్పు ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా..?

పచ్చి బాదంపప్పు లో అమిగాల్డిన్ అనే మూలకం ఉంటుంది. ఇది రుచిలో కొంచెం చేదుగా ఉంటుంది. తక్కువ మోతాదులో వీటిని తింటే ఇబ్బందేమీ ఉండదు కానీ.. ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఎక్కువగా పచ్చి బాదం తినడం వలన శరీరం పోషకాలను గ్రహించలేదు ఇందులో టానిన్ లు ఉంటాయి. వాటి వలన శరీరం పోషకాలను శోషించుకోవడం లో సమస్యలు తలెత్తుతాయి.

దేహానికి అవసరమైన శక్తి లభించదు. ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ప్రతి ఒక్కరూ బాదం పప్పును రకరకాలుగా తీసుకుంటారు. చాలా మంది పచ్చిగా తింటారు, కొందరు నానబెట్టి తినడానికి ఇష్టపడతారు. బాదంపప్పులో విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్స్, డైటరీ ఫైబర్ ఉంటాయి. పచ్చి బాదంపప్పును సమతుల్య పరిమాణంలో తింటే ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ దానిని అధికంగా తీసుకోవడం 4 విధాలుగా హానికరం.

పోషకాల శోషణలో ఇబ్బందులు.. పచ్చి బాదం పప్పులను ఎక్కువగా తినడం వల్ల మన శరీరం కొన్ని రకాల పోషకాలు గ్రహించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆకుపచ్చ బాదంలో టానిన్ ఉంటుంది. ఇది మన జీవక్రియకు ఆటంకం కలిగిస్తుంది. కాలేయానికి నష్టం.. పచ్చి బాదం పప్పులను ఎక్కువగా తింటే జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కాలేయంపైనా ప్రభావం పడుతుంది. ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి.

కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. మైగ్రేన్ ఉన్నవారు తినొద్దు.. మైగ్రేన్‌తో బాధపడేవారు పచ్చి బాదం ఎక్కువగా తినకూడదు. ఒకవేళ ఎక్కువగా తింటే ఆ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పులో అనేక సమ్మేళనాలు ఉంటాయి. దీని కారణంగా శరీరంలో అనేక రసాయన ప్రతిచర్యలు జరుగుతాయి.

అందుకే పచ్చి బాదం పప్పును తినొద్దని వైద్యులు కూడా సూచిస్తారు. కిడ్నీ సమస్యలు.. బాదం పప్పు అతిగా తింటే.. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇందులో ఆక్సలేట్ ఉన్నందున కిడ్నీ సమస్యలతో బాధపడేవారు బాదం పప్నును తినకూడదని వైద్యులు సూచిస్తారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker