రామ్ చరణ్ తండ్రి కాబట్టే చిరంజీవిని ఫోకస్ చేశానన్న కెమెరామెన్. పుత్రోత్సాహము అంటే ఇదే.
అయోధ్య బాలరాముడికి బాలక్ రామ్‌గా, ఆలయానికి బాలక్ రామ్ మందిరంగా నామకరణం చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు. ఇక అయోధ్యలో టెంటులో ఉన్న పాత రామ్ లల్లా విగ్రహం గురించి కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే . తెలుగు రాష్ట్రాల నుంచి ఆహ్వానం పొంది ఆ వేడుకకు హాజరైన అతి కొద్దీ మందిలో మెగా ఫ్యామిలీలో ఈ ముగ్గురూ ఉన్నారు.
ఇక ఈ క్రమంలో అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఓ నేషనల్ మీడియా కెమెరా మెన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయోధ్య వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి అక్కడున్న అనిల్ అంబానీతో మాట్లాడుతున్న సమయంలో అక్కడి నేషనల్ మీడియా కెమెరాలు అన్నీ చిరంజీవిని ఫోకస్ చేశాయి. అయితే ఎక్కువ సేపు ఎందుకు అదే ఫ్రేమ్ పెట్టారు అని అధికారులు అడిగితే వెంటనే ‘అక్కడ రామ్ చరణ్ ఉన్నారు, పక్కనుంది ఆయన తండ్రి. అందుకే ఫ్రేమ్ ఫోకస్ లో పెట్టాం’ అని కెమెరా మెన్ చెప్పారు.
అయితే నిజానికి మనదగ్గర అంటే తెలుగు రాష్ట్రాలు సహా సౌత్ అంతా చిరంజీవి కొడుకుగానే రామ్ చరణ్ ని గుర్తు పడతారు. అయితే అందుకు భిన్నంగా రాంచరణ్ తండ్రి ఆయన అని నార్త్ వాళ్ళు మాట్లాడుకునే రేంజ్ లో చరణ్ క్రేజ్ ఎగబాకడం ఇక్కడ గమనించాల్సిన విషయం. దానికి కారణం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించి ఆ దెబ్బతో నార్త్ లో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్నారు.
ముఖ్యంగా క్లైమాక్స్ లో రాముని పోలి ఉన్న అల్లూరి గెటప్ లోకి రామ్ చరణ్ మారిన తరువాత నార్త్ ఆడియన్స్ ఆ సీక్వెన్స్ మొత్తానికి ఫిదా అయిపోయారు.
• @ANI Cameraman : "Ye Abhi RamCharan ki Pita hei isliye inko Frame Mei Rakha hua hei, #RamCharan ke Father Hei" 🥹🥹@AlwaysRamCharan 🫡 pic.twitter.com/sdt16LuFBu
— Raees (@RaeesHere_) January 22, 2024