ప్రభుత్వం కీలక నిర్ణయం, రేషన్ కార్డు ఉన్న అదిరే శుభవార్త..!
రేషన్ కార్డు ఉన్నవారిక ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామని చెప్పారు. వీలైనంత త్వరలో రూ.500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. మహిళలకు నెలకు రూ.2500 పథకం కూడా త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. అయితే పథకాలన్నింటికి కూడా రేషన్ కార్డు మస్ట్ షుడ్ చేసే అవకాశం ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉచిత బస్ స్కీమ్ అమలు చేస్తోంది.
ఇక రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను కూడా అతిత్వరలోనే అమలు చేయనుంది. ఈ స్కీమ్స్ కింద ప్రయోజనం పొందాలని భావించే వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాల ఎంపికకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే అప్పుడు రేషన్ కార్డు లేని వారిపై ప్రభావం పడొచ్చు.
సీఎం రేవంత్ సర్కార్ ప్రాథమికంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నెలలోనే ఈ రెండు పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తోంది. ఇకపోతే ఉచిత విద్యుత్‌కు సంబంధించి ఇంటి యజమాని ఆధార్, రేషన్ కార్డు ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు తీసుకోనున్నారు. అందువల్ల మీరు కూడా ఈ స్కీమ్స్ ప్రయోజనాలు పొందాలని భావిస్తే.. ఈ విషయాన్ని గుర్తించుకోవడం ఉత్తమం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారెంటీలను అమలు చేసింది.
మొత్తం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీనిలో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణంతో పాటు.. ఆరోగ్యశ్రీ గరిష్ఠ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు దవాఖానాల్లో పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు మరింత వైద్యసాయం అందించాలనే ఉద్దేశ్యంతో పరిధిని పెంచారు.
ఇక వీటితో పాటు.. ఇటీవల తెలంగాణ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.500 గ్యాస్ సిలిండర్ తో పాటు.. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కు సైతం ఆమోదం లభించింది. ప్రజాపాలన దరఖాస్తుల్లో ఎక్కువగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్థిక భరోసా కింద ఇచ్చే రూ.2500 వంటి వాటికి ఎక్కువ దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే.