అందంలో తల్లిని మించిపోయిన గౌతమి కూతురిని చూశారా..?
తెలుగుతో పాటు తమిళ, మలయాళం సినిమాల్లో నటించిన గౌతమ ప్రేక్షకులకు హాట్ ఫేవరేట్ హీరోయిన్ గా మారింది. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లో సైడ్ పాత్రల్లో కనిపించిన గౌతమి మరోసారి ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే మళ్లీ సౌత్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో సహాయ పాత్రలు పోషిస్తుంది. ఇక గౌతమి కూతురు సుబ్బలక్ష్మి ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఉన్నత చదువులు పూర్తి చేసిన సుబ్బలక్ష్మి నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటుంది.
గ్లామరస్, ఫ్యాషనబుల్ ఫోటోస్ అభిమానులతో పంచుకుంటుంది. సుబ్బలక్ష్మి చూడ్డానికి అచ్చం తన తల్లిలాగే మరింత అందంగా ఉంటుంది. అలాగే గ్లామర్ షోకు దూరంగా ఉంటూ తల్లిలాగే ట్రెడిషనల్ లుక్స్తోనే కట్టిపడేస్తుంది సుబ్బలక్ష్మి. ఆమె చూడ్డానికి బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఉందిని కామెంట్స్ చేస్తుంటారు నెటిజన్స్. అయితే కేవలం సోషల్ మీడియా వరకే యాక్టివ్ గా ఉన్న సుబ్బలక్ష్మికి నటనపై అంతగా ఆసక్తి లేనట్లుగా తెలుస్తోంది.
కానీ ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని గతంలో వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. ప్రస్తుతం గౌతమి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రేమ, పెళ్లి, విడాకుల తర్వాత చాలాకాలం పాటు ఒంటరిగానే ఉంది గౌతమి.
ఆ తర్వాత 2004 నుంచి 2016 వరకు కమల్ హాసన్ తో సహజీవనం చేశారు. కానీ ఆ తర్వాత వీరి బంధం అనుహ్యంగా ముగిసింది. ప్రస్తుతం గౌతమి తన కూతురితో కలిసి ఒంటరిగానే ఉంటుంది.