గోరుల్లో ఈ మార్పులు వచ్చాయా..! అది దేనికీ సంకేతమో తెలుసా..?
గోరుచుట్టు చేతిలో చీముపట్టి చాలా బాధించే వ్యాధి. ఇది బాక్టీరియా లేదా శిలీంద్రాల వలన సంక్రమిస్తుంది. చీము ఎక్కువగా ఉన్నచో చిన్న గంటు పెట్టి దాన్ని తొలగించవలసి వస్తుంది.గోర్లు నోటితో కొరికేవారిలో చిన్న గాయంతో ఇది మొదలవుతుంది. అయితే గోరు చుట్టూ ఇన్‌ఫెక్షన్ రావడం, తెలియకుండానే గోర్లను ఊకే కొరకడం చేస్తుంటారు. కొన్ని సార్లు నొప్పి ఎక్కువై గోరు అందవికారంగా తయారవుతుంది. గోరు చుట్టు ఉన్న చర్మం ఎర్రగా కమిలిపోయి పాపం నరకం అనుభవిస్తారు. మీలో ఎవరైనా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే..టీట్రీ ఆయిల్‌ను ఉపయోగించండి.
గోరు చుట్టు సమస్యకు ఈ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. ట్రీ ఆయిల్‌లో అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చర్మానికి చాలా మేలు చేస్తుంది. మొటిమలు, రింగ్‌వార్మ్ మరియు దురద వంటి చర్మ సంబంధిత సమస్యలలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందట.. బ్యాక్టీరియా మరియు ఫంగల్ చర్మ పరిస్థితులకు చికిత్సకు టీ ట్రీ ఆయిల్ ఉపయోగడుతుంది. గోరు చుట్టు సమస్యకు టీట్రీ ఆయిల్‌ను ఎలా వాడాలంటే. వేడి నీటిలో 2 టీ స్పూన్ల పసుపు ,రెండు చుక్కలు టీ ట్రీ ఆయిల్‌ని వేయండి.. తరువాత గోరుచుట్టు వేళ్ళను ఈ నీటిలో 20 నిమిషాలు ఉంచాలి.
ఆ తర్వాత దూది తీసుకుని గోరుచుట్టు ఉన్న ప్రాంతంలో క్లీన్ చేయాలి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గోరు చుట్టు సమస్య త్వరగా తొలగిపోతుంది. టీ ట్రీ ఆయిల్ ఉపయోగించడం చాలా సులభం. సాంప్రదాయ ఔషధాల మాదిరిగానే దీనిని ఉపయోగించవచ్చు. గోరుచుట్టూ సమస్య ఎందుకు వస్తుంది..గోర్లు సరిగ్గా కత్తిరించుకోకపోవడం, అసాధారణమైన గోర్లు, బొటనవేలిపై బాగా ఒత్తిడి కలిగించే పాదరక్షలు వేసుకోవడం వల్ల..
బొటనవేలికి గాయాలైనప్పుడు.. అపరిశుభ్రమైన పాదాలు.. వంశపారంపర్య కారణాలు.. ఇవన్నీ గోరుచుట్టు సమస్యకు కారణాలు అవుతాయి..కాబట్టి జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించండి.! అలాగే సమస్య ఉన్నవారు పైన చెప్పిన విధంగా టీట్రీ ఆయిల్‌ను వాడితే మంచి ఫలితం ఉంటుంది. టీ ట్రీ ఆయిల్‌ను టీ ఆకుల నుండి తయారు చేస్తారు. దీనిని సాధారణంగా లభించే టీ ఆకులు నుంచి కాకుండా ఆస్ట్రేలియా చెందినది టీ మొక్క బెరడు నుంచి తీస్తారు. ఈ టి ట్రీ మొక్కతో చేసిన నూనె మనకు మార్కెట్లో అందుబాటులోనే ఉంటుంది కాబట్టి సమస్య ఉండదు.