Health

ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే గోరింటాకు ఎర్రగా పండుతుంది.

ఆకు తీసుకోని చిన్న పటిక ముక్క లేదా రెండు లవంగాలు వేసి రుబ్బుకోవాలి. తర్వాత అందులో రెండు చుక్కల యూకలిప్టస్‌ నూనె కలిపి ఓ పావుగంట పక్కన పెట్టి తర్వాత చేతికి పెట్టుకుంటే మీ చేతులు ఎర్రటి రంగులో మెరవడం ఖాయం. అయితే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి.. ఈ పండుగకు గోరింటాకు పెట్టుకోవడం అందరికీ ఎంతో ఇష్టం.

కానీ కొంతమందికి గోరింటాకు ఎర్రగా పండదు. కానీ ఏ చిట్కాలు పాటిస్తే మాత్రం మీ చేతులు ఎర్రగా పండుతాయి. ఈ చిట్కాలు తెలిస్తే ఇంత సింపుల్ ఆ అనుకుంటారు. గోరింటాకు ఆకులతో గోరింటాకు పెట్టుకుంటే ఎంతో మంచిది గోర్ల సంబంధిత సమస్యలను తొలగించడంతోపాటు శరీరంలోని వీడిని కూడా గ్రహిస్తుంది.

మానసిక ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. కానీ గోరింటాకు పెట్టుకోవడం ఇష్టం లేనివారు బ్రాండెడ్ కోన్ మాత్రమే ఎంచుకోవాలి. అది అయితేనే బాగా పండుతుంది. గోరింటాకు పెట్టుకునే ముందు రెండు చేతులను శుభ్రంగా కడుక్కొని ఆ తరువాత గోరింటాకు పెట్టుకోవాలి. గోరింటాకు పెట్టుకున్న తర్వాత నిమ్మకాయ, పంచదార కలిపిన నీళ్లతో చల్లాలి.

గోరింటాకు ఆరిపోయిన తర్వాత ఒకేసారి నీళ్లతో కడగకుండా గోరింటాకు ఎండిపోయి రాలేంతవరకు ఉంచుకోవాలి. మొత్తం రాలిపోయిన తర్వాత.. చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే గోరింటాకు ఎర్రగా పండుతుంది. అయితే గోరింటాకు ఎర్రగా పండదు అనుకునే వారికి చేతులు కడుక్కున్న వెంటనే కొబ్బరి నూనె రాసుకోవాలి ఇలా చేస్తే ఎర్రగా పండుతుంది.

మరి కొంతమంది చెప్పేదేంటంటే గోరింటాకు పెట్టుకున్న తరువాత జండుబాం చేతులకు రాసుకున్న కూడా ఎర్రగా పండుతుందని అంటున్నారు. గోరింటాకు పెట్టుకునే ముందు ఈ యొక్క లెఫ్ట్ డ్రెస్ ఆయిల్ చేతులకు రాసుకొని ఆ తరువాత గోరింటాకు పెట్టుకుంటే కచ్చితంగా ఎర్రగా పండుతుందని పెట్టుకున్న వారు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker