Health

మంచి లైంగిక జీవితానికి కండోమ్స్ బెటరా..? లేదా పిల్స్ మంచిదా..?

మీ లైంగిక పనితీరును మెరుగుపరిచే ప్రధానమైనది శారీరక శ్రమ. శారీరక ఉద్రేకం మంచి రక్త ప్రవాహంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి.. ఏరోబిక్ వ్యాయామం (ఇది మీ గుండె, రక్త నాళాలను బలపరుస్తుంది) మంచిది. అంతేకాకుండా వ్యాయామాలు గుండె జబ్బులు, బోలు ఎముకల వ్యాధి, కొన్ని రకాల క్యాన్సర్‌లను అరికట్టడం నుంచి.. మీ మానసిక స్థితిని మెరుగుపరచడం వరకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మీరు రాత్రి మంచి నిద్రను పొందడంలో సహాయం చేసి.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. అయితే అయితే పిల్లలు మాత్రమే వద్దు అనుకుంటారు కాబట్టి లైంగికంగా దూరంగా ఉంటారా అంటే లేదు.

మరి దీనికి పరిష్కారం ఎలా? అవే కండోమ్స్, పిల్స్. ఈ రెండూ ఉపయోగిస్తూ.. లైంగిక జీవితానికి దగ్గరగా ఉంటారు. అయితే ఇవి మహిళ శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి. మీ సెక్స్ లైఫ్​ పై కూడా ఇవి ప్రభావం చూపిస్తాయా? ఇంతకీ ఈ రెండిట్లో ఏది శ్రేయస్కరం.. కండోమ్స్, పిల్స్​లో సరైన ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. మీకు తెలుసో లేదో.. ఇది మీ సెక్స్ డ్రైవ్​ పై ప్రభావం చూపిస్తుందని ఓ సర్వే తేల్చింది. గర్భం నిరోధించేందుకు కండోమ్స్, పిల్స్ రెండూ అందరికీ తెలిసిన మార్గాలు. అయితే ఇవి రెండు ప్రయోజనాలతో పాటు.. కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఇస్తాయి. ఇవి మీ లైంగిక జీవతంపై దీర్ఘకాలం ప్రభావంం చూపిస్తాయంటున్నారు నిపుణులు.

కండోమ్​లు బెటరా..? మీకు తెలుసా..? కండోమ్​ల వాడకం వల్ల పురుషుల్లో లిబిడో తగ్గుతుందట. అది నపుంసకత్వానికి దారి తీస్తుందని చెప్తారు. కొందరిలో లైంగిక ఆనందాన్ని దూరం చేస్తుందని.. లేదా పూర్తిగా ఆ కోర్కిలు చంపేస్తుందట. అయితే దీనిని నిరూపించడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవు. కానీ చాలామంది దీనిని నమ్ముతున్నారు. అయితే బర్త్ కంట్రోల్ పిల్స్​ కంటే కండోమ్స్ మంచి ఎంపిక అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ పిల్స్ హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. మహిళ శరీర పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. అవాంఛిత దుష్ర్పభావాలకు కారణమవుతాయి. అంతేకాదండోయ్.. కండోమ్​లు పిల్స్​ కంటే చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి.

ఇవి లైంగిక ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. STD, HIV వంటి వాటినుంచి రక్షణ కల్పిస్తాయి. బర్త్ కంట్రోల్ పిల్స్ బెటరా..? గర్భాధారణను నివారించడంలో బర్త్ కంట్రోల్ పిల్స్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అయినప్పటికీ.. ఇవి కొన్ని దుష్ప్రాభావాలకు దారితీస్తాయి. దానిలో మొదటి లిబిడో తగ్గుదల. పిల్స్ తీసుకోవడం వల్ల కలిగే హార్మోన్లలో మార్పుల కారణంగా మహిళల్లో లిబిడో తగ్గుతుంది. సాధారణంగా మహిళల్లో లైంగిక కోర్కిలు ఏదొక రీజన్​తో తగ్గిపోతూ ఉంటాయి. అయితే ఈ పిల్స్​ వల్ల ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశముంది.

అంతేకాకుండా హార్మన్లలో మార్పుల వల్ల మానసికంగా కూడా కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి మీరు గర్భాన్ని నిరోధించుకోవాలనుకున్నప్పుడు సరైనది ఎంపిక చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏదొకటి కచ్చితంగా ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీ వైద్యుడిని సంప్రదించండి. వారు మీ ఆరోగ్య పరిస్థితులు, మానసిక స్థితులను దృష్టిలో ఉంచుకుని.. మీకు ఏది మంచిదో చెప్తారు. లేదంటే మరేదైనా పద్ధతులు వారు సూచిస్తారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker