గూగుల్ పే, ఫోన్‌పే వాడే వారికి గుడ్ న్యూస్. ఎలానో తెలుసా..?
ప్రస్తుతం దేశంలో 96% UPI లావాదేవీలు కేవలం మూడు యాప్‌ల ద్వారానే జరుగుతున్నాయి. వీటిలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలు ఉన్నాయి. వీటిలో 80% యూపీఐ లావాదేవీలు ఫోన్ పే, గూగుల్ పే రెండు యాప్‌ల ద్వారానే జరుగుతున్నాయి. అయితే అయితే మీకు శుభవార్త. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా కీలక ప్రకటన చేసింది.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) మార్కెట్ క్యాప్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణంగా గూగుల్ పే, ఫోన్‌పే వంటి థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్‌కు సంబంధించి ఎన్‌పీసీఐ 30 శాతం మార్కెట్ వాటా రూల్‌ను తీసుకువచ్చింది. ఈ నిబంధన డిసెంబర్ 31 నాటికి అమలు కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఎన్‌పీసీఐ మాత్రం ఈ డెడ్‌లైన్‌ను మరో రెండేళ్లు పొడిగించింది. అంటే 2024 డిసెంబర్ 31 వరకు వీటికి గడువు లభించింది. దీని వల్ల ఈ యాప్స్ ఉపయోగిస్తున్న వారిపై కూడా ప్రభావం ఉండదు. ట్రాన్సాక్షన్లకు సంబంధించి ఎలాంటి పరిమితులు అమలులోకి రావు. ఇప్పుడు ఎలాగైతే సర్వీసులు ఉపయోగిస్తున్నారో.. భవిష్యత్‌లో కూడా అలానే సేవలు పొందొచ్చు.
ప్రస్తుత వినియోగం, భవిష్యత్ సామర్థ్యం సహా పలు ఇతర అంచనాలను పరిగణలోకి తీసుకొని థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లకు సంబంధించి మార్కెట్ (వాల్యూమ్ పరంగా) వాటా పరిమితి ఆంక్షల గడువును మరో రెండేళ్లు పొడిగిస్తున్నామని ఎన్‌పీసీఐ తెలిపింది. 2024 డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చినట్లు వెల్లడించింది. గడువు పొడిగింపు నేపథ్యంలో ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటిని మరో రెండేళ్లు గడువు లభించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇవి రెండూ మార్కెట్ లీడర్లుగా కొనసాగుతూ వస్తున్నాయి. ఫోన్‌పే మార్కెట్ వాటా ఏకంగా 47 శాతంగా ఉంది. అలాగే గూగుల్ పే మార్కెట్ వాటా 34 శాతంగా కొనసాగుతోంది. పేటీఎం కూడా అధిక వాటాను కలిగి ఉంది. దీని మార్కెట్ వాటా 15 శాతంగా కొనసాగుతోంది.
కొత్త రూల్స్ అమలులోకి వస్తే.. మార్కెట్ వాటా 30 శాతం మించకూడదు. అంటే ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్‌పై ప్రభావం పడుతుంది.పేటీఎంకు వచ్చే నష్టం ఏమీ లేదు. కాగా ఫోన్‌పే సీఈవో, ఫౌండర్ సమీర్ నిగమ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. మార్కెట్ వాటా ఆంక్షలు అమలులోకి వస్తే.. కోట్ల మంది యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఆంక్షలు విధించాల్సి వస్తుందని తెలిపారు. దీని వల్ల డిజిటల్ పేమెంట్స్ పెరుగుదలపై ప్రభావం పడొచ్చని పేర్కొన్నారు. కాగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి సంస్థలే యూపీఐ మంత్లీ వాల్యూమ్స్‌లో 96 శాతం వాటాను ఆక్రమించాయి. అమెజాన్ పే, వాట్సాప్ పే వంటివి అతితక్కువ వాటాను కలిగి ఉన్నాయి. యూపీఐ మార్కెట్‌లో గుతాధిపత్యం ఉండకూడదనే లక్ష్యంతో ఎన్‌పీసీఐ ఈ మార్కెట్ వాటా 30 శాతం పరిమితిని తీసుకువస్తోంది.