మహిళలకు గుడ్‌న్యూస్. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు. కొత్త ధరలు ఇదే.
గత పది రోజులుగా వరుసగా గోల్డ్ రేటు రూ.600 మేర పెరిగిన సంగతి తెలిసింది. దీంతో మహిళలు, పసిడి ప్రియులు కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేశారు. వారందరికీ ఊరట కలిగిస్తూ గోల్డ్ రేట్లు ఇవాళ దిగివచ్చాయి. మన దేశంలో బంగారం అంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే అయితే, అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ధరలు తగ్గితే.. మరి కొన్నిసార్లు పెరుగుతుంటాయి.
తాజాగా ఫిబ్రవరి 4 ఆదివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.20లు తగ్గి రూ.5,810ల వద్ద ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.22లు తగ్గి రూ.6,338ల వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200లు తగ్గి రూ.58,100లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.220లు తగ్గి రూ.63,380ల వద్ద కొనసాగుతోంది.
అలాగే, 18 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రూ.16లు తగ్గి రూ.4,754 వద్ద ఉండగా.. 10 గ్రాములు ధర రూ. 160లు పెరిగి రూ.47,540లుగా నిలిచింది. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా.. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,540, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.58,100, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.63,380.
విజయవాడలో బంగారం ధరలు ఇలా..18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,540, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.58,100, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.63,380.