మహిళలకు గుడ్ న్యూస్. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.
బంగారం కొనే వారు తయారీ చార్జీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తక్కువ తయారీ చార్జీలు ఉన్న జువెలరీ ఎంచుకోవడం ఉత్తమం. లేదంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. కాగా రానున్న కాలంలో వెండి ధర భారీగా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. అందువల్ల తగ్గినప్పుడు కొనేసుకోవడం ఉత్తమం. అయితే బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం.
ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా. బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది.. దాంతో మార్కెట్ లో బంగారం కొనుగోళ్లు కూడా ఎక్కువ అయ్యాయి.
తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే. హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి, రూ. 59, 840 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి, రూ. 54, 850 గా పలుకుతుంది.
ఇక వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 500 తగ్గిపోయి రూ. 77, 000 గా నమోదు అయింది.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం గ్రాము నేడు రూ. 15 లు తగ్గి గ్రాము పసిడి ధర రూ. 5,500లుగా కొనసాగుతుంది.
చైన్నై లో 22 క్యారెట్ల బంగారం గ్రాము నేడు రూ. 20 లు తగ్గి గ్రాము పసిడి ధర రూ. 5,5100లుగా కొనసాగుతుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం గ్రాముపై రూ . 15 లు తగ్గి గ్రాము పసిడి ధర రూ. 5,485లుగా కొనసాగుతుంది. వెండి విషయానికొస్తే..కేజీ వెండి ధర రూ. 500 తగ్గిపోయి రూ. 77, 000 గా నమోదు అయింది