Health

ఇలా చేస్తే గొంతులో పొట్టలో పెరుకపోయిన కఫం, తెమడని రెండే రోజుల్లో పూర్తిగా బయటకు పోతుంది.

ఆయుర్వేదంలో ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారముంది. గొంతు సంబంధిత సమస్యలకు, శీతాకాలం ఎదురయ్యే అనారోగ్య సమస్యలకు మంచి పరిష్కారముంది. ముఖ్యంగా చలికాలంలో కఫం అనేది ప్రధాన సమస్యగా కన్పిస్తుంది. చాలా సందర్భాల్లో ఎంత కష్టపడినా ఈ కఫం సమస్య పోదు. కఫం సమస్య ఎక్కువైతే ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టమౌతుంటుంది. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది తెమడ, కఫం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ కఫం, తెమడతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ముఖ్యంగా చలి కాలంలో చాలా మంది ఈ సమస్యలను ఫేస్ చేస్తున్నారు.

చిన్న పిల్లల నుంచి పెద్ద వారి దాకా వీటిని ఎదుర్కొంటున్నారు. ముక్కు పట్టేసి, గొంతు పట్టేసి తినడానికి, నిద్ర పోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలా గొంతులో, పొట్టలో తెమడ, కఫం పేరుకు పోవడానికి ముఖ్య కారణం నోటిలోని క్రిములు, బ్యాక్టీరియా. నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే ఇవి పట్టకుండా ఉంటాయి. వేప పుల్లతో నోటి ఆరోగ్యం..ప్రస్తుతం అందరూ టూత్ పేస్ట్‌లతో నోటిని శుభ్రం చేసుకుంటున్నారు. ఎన్ని రకాల టూత్ పేస్ట్‌లు వాడినప్పటికీ దంతాల సమస్యతో బాధ పడుతున్నారు. కానీ పూర్వం ఈ టూత్ పేస్టులు వంటివి ఉండేవి కావు.

కేవలం వేప పుల్లతో మాత్రమే నోటిని శుభ్రం చేసుకునే వారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ వేప పుల్లనే ఉపయోగించేవారు. అందుకే అప్పుడున్న వారికి దంత సమస్యలు అనేవి పెద్దగా ఉండేవి కావు. వేప పుల్లలు వాడటం వల్ల నోటి ఆరోగ్యం మెరుగు పడుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేప పుల్లలను వాడటం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా, దంతాల మధ్యలో పేరుకుపోయిన బ్యాక్టీరియా అనేది నశిస్తుంది. వేప పుల్లతో పొట్ట కూడా క్లీన్..వేప పుల్లతో దంతాలను శుభ్రం చేసుకుంటే నోట్లో లాలాజలం అనేది ఎక్కువగా ఉత్పత్తి అయ్యేంది.

దీంతో నోరు కూడా ఫ్రెష్‌గా, ఎలాంటి దుర్వాసన రాకుండా ఉండేంది. నోట్లో ఉండే క్రిములు, దంతాలపై పేరుకు పోయిన బ్యాక్టీరియాను, గారను, ఇన్ ఫెక్షన్‌కు కారణం అయ్యే సూక్ష్మ జీవుల్ని నశింప చేసే గుణం వేపలో ఉంది. వేప పుల్ల వాడటం వల్ల గొంతులో, పొట్టలో పేరుకుపోయిన తెమడ, కఫం, పసర వంటివి కూడా బయటకు వచ్చేస్తాయి. వేప పుల్లతో శుభ్రం చేసుకోవడం వల్ల నోటితో పాటు పొట్ట కూడా క్లీన్ అవుతుంది.

గొంతులో ఇన్ ఫెక్షన్‌ రాదు..గొంతులో కఫం, తెమడ వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు.. కానీ వారంలో ఒక్కసారైనా వేప పుల్లతో నోటిని శుభ్రం చేసుకుంటే.. దంతాలు, నోరు, గొంతు, పొట్ట క్లీన్ అవుతాయి. కఫం, తెమడ వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. వేప చేదు కారణంగా గొంతు నొప్పి, గొంతులో ఇన్ ఫెక్షన్ వంటివి కూడా రావు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker