Health

షుగర్, దగ్గు, ఆయాసం ఉన్నవారు ఖచ్చితంగా గోంగూరని తినాలి. ఎందుకంటే..?

గోంగూరలో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. దీంతో కంటి సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. అలాగే దంత సమస్యలు ఉంటే అవి కూడా ఈజీగా తగ్గిపోతాయి. గోంకూరలో క్యాల్షియం కూడా బాగా ఉంటుంది. ఎముకలు బలంగా మారేందుకు గోంగూర బాగా ఉపయోగపడుతుంది. అయితే గోంగూరతో మనం ఎన్నో రకాల వంటలు చేసుకొనవచ్చు. గోంగూరతో వండిన వంటలు రుచికి పుల్లగా ఉంటాయి.

ఎంత తిన్న ఇంకా తినాలంపించేంత కమ్మగా ఉంటాయి. ఇందులో మనకి చాలా విటమిన్స్ మరియు మినరల్స్ ఉంటాయి. గోంగూర యొక్క లాభాలు.. గోంగూరలో ఫైబర్ అధికంగా ఉండడం వలన జీర్ణక్రియ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలానే మలబద్ధకం, డైయేరియా మొదలగు సమస్యలు తగ్గుతాయి. దీన్ని మనం రెగ్యులర్ గా వాడడం వలన డైజేషన్లో సమస్యలు తొలగిపోతాయి. గోంగూర లో విటమిన్ సి అధికంగా ఉండడం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తుంది. దీనివలన ఇమ్యూనిటీతో పాటు యాంటీబాడీస్ కూడా పెరుగుతాయి.

గోంగూరలో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. మాములుగా డాక్టర్స్ 30 సంవత్సరాలు పైబడిన ఆడవారిని కాల్షియం ఎక్కువగా తీసుకోమని చెబుతుంటారు. దీనిని తీసుకోవడం వల్ల కాల్షియం సమృద్ధిగా దొరుకుతుంది. గోంగూరలో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వలన కంటి ఆరోగ్యాన్ని చాలా బాగా మెరుగుపరుస్తుంది.అలానే “రే చీకటి ” తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గోంగూర లో ఉండే న్యూట్రియంట్స్, యాంటీఆక్సిడెంట్స్, ప్లేవనాయిడ్స్ వలన “కాన్సర్ ట్యూమర్” ని పెరగకుండా చూస్తుంది. అలానే గోంగూర ఆకుల్లో ఉండే క్లోరోఫిన్ బ్రెస్ట్ కాన్సర్ ఉన్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గోంగూర లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.దీనితో పాటు జింక్, పాస్పరస్, సోడియం ఉంటాయి.గోంగూర లో ఐరన్ ఎక్కువగా ఉండడం వలన రక్తహీనతతో బాధపడేవారికి గోంగూర చాలా మంచిది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే మహిళలు గోంగూరను ఆహారంలో తీసుకోవడం వలన హిమోగ్లోబిన్ పెరుగుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker