మహిళలకు గుడ్ న్యూస్, భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు.
బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన గోల్డ్ రేట్లు ప్రస్తుతం తిరుగు ప్రయాణంలో ఉంది. వారం రోజులుగా పైపైకి పోతున్న గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ హైకి చేరుకొని తిరిగి యూ టర్న్ తీసుకున్నాయి. దీంతో బంగారం కొనాలనే ప్లాన్ లో ఉన్నవారికి మరో ఛాన్స్ వచ్చింది.
నిన్నటితో పోల్చితే తులానికి 1000 రూపాయలు తగ్గింది గోల్డ్ రేటు. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,420 స్థాయికి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు అయితే రూ. 67,300 రూపాయలకు దిగి వచ్చింది. గత మూడు రోజుల్లోనే దాదాపు 1500 లకు పైగా గోల్డ్ రేటు తగ్గింది. ఈ గోల్డ్ రేట్లు జనాన్ని ఆకర్షిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు డిమాండ్ ని బట్టి గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి.
ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్లలో భారీ మార్పు చోటు చేసుకుంటోంది. తీవ్ర హెచ్చుతగ్గుల నడుమ ఊగిసలాడుతోంది వెండి, బంగారం. బంగారం కొనేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మోసపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం స్వచ్ఛతతో పాటు మేకింగ్ చార్జీలపై పూర్తి అవగాహన ఉండాలి. మేకింగ్ ఛార్జీల పేరుతో కూడా మోసం జరిగే అవకాశాలు ఉన్నాయని గమనించాలి.
ఈ ఏడాది బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పు చోటుచేసుకుంటుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేటు తగ్గిన ప్రతిసారి ఇన్వెస్టర్లను బాగా ఆకర్షిస్తోంది వెండి బంగారం. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే చుక్కలు చూపించగా.. నేడు ఒక్క రోజే భారీగా రేటు తగ్గడం గమనించాల్సిన విషయం. నిన్నటితో పోల్చితే నేడు కిలో వెండికి 3300 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి 97 వేల రూపాయలకు దొరుకుతోంది.