కుప్పకూలుతున్న బంగారం ధర, రూ.4,600 పతనమైన బంగారం, వెండి ధరలు.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో దేశీయంగా ధరలు దిగివస్తున్నాయి. రికార్డ్ గరిష్ఠాల నుంచి గోల్డ్ రేట్లు పడిపోతుండడం పసిడి ప్రియులకు ఊరటగా చెప్పవచ్చు. ఇన్నాళ్లు ధరలు పెరుగుతుండడంతో పసిడి, వెండి కొనేందుకు వెనకడుగు వేసిన వారికి కొనుగోలు చేసేందుకు మంచి అవకాశంగా బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు అనేలా పసిడి రేట్లు భారీగా దిగి వచ్చాయి.
బంగారం కొనే ప్లానింగ్‌లో ఉన్న వారు ఈ అవకాశం మిస్ అవ్వొద్దు. దేశంలో బంగారం ధరలు దిగి వచ్చాయి. ఈక్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. పసిడి రేటు వెలవెలబోయింద. ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు గత ఐదు రోజుల కాలంలో భారీగా దిగి వచ్చాయి. బంగారం ధరలు మే 25న రూ. 72,430 వద్ద ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరలకు ఇది వర్తిస్తుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర అయితే రూ. 66,390 వద్ద ఉంది.
ఇక 18 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే.. ఈ పసిడి రేటు రూ. 54,320 వద్ద కొనసాగుతోంది. పది గ్రాములకు ఈ రేట్లు వర్తిస్తాయి. అయితే మే 20న చూస్తే.. బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,160 వద్ద ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర అయితే రూ. 68,900 వద్ద ఉండేది. అంటే పసిడి రేటు భారీగా పరుగులు పెట్టిందని చెప్పుకోవచ్చు. 20 నుంచి చూస్తే.. ఇప్పటి వరకు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర అయితే ఏకంగా రూ. 2750 మేర పతనమైందని చెప్పుకోవచ్చు.
ఇక 22 క్యారెట్ల బంగారం రేటు అయితే.. రూ. 2,500కు పైగా దిగి వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే పసిడి రేటు చూస్తూ చూస్తూనే భారీగా తగ్గిందని చెప్పుకోవచ్చు. కాగా పైన ఇచ్చిన బంగారం ధరలకు వస్తు సేవల పన్ను అదనంగా పడుతుంది. జీఎస్‌టీ కూడా కలుపుకుంటే బంగారం రేట్లు పైకి చేరుతాయి. అలాగే జువెలరీ తయారీ చార్జీలు కూడా ఉంటాయి. అప్పుడు బంగారు ఆభరణాల రేటు పైకి కదులుతుంది.
అందువల్ల కొనుగోలు దారులు ఈ విషయాన్ని గుర్తించాలి. వెండి ధరల విషయానికి వస్తే.. సిల్వర్ రేటు మే 20న రూ. లక్ష మార్క్ పైకి వెళ్లింది. రూ.1,01,000కు చేరింది. అయితే తర్వాత తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం వెండి ధర మే 25న రూ. 96,400 వద్ద ఉంది. అంటే వెండి రేటు ఏకంగా రూ. రూ.4,600 తగ్గిందని చెప్పుకోవచ్చు.