భారీగా పడిపోయిన బంగారం ధరలు, కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే..?
ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2320 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ ధర తగ్గి 27.27 డాలర్ల వద్ద ఉంది. ఇక డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ మళ్లీ పెరిగింది. అయితే ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో బంగారం కొనుగోలు దారులకు చుక్కలు కనిపించాయి. అయితే ఇప్పుడు క్రమంగా గోల్డ్ రేట్లు దిగి వస్తున్నాయి. ఇది గోల్డ్ ప్రేమికులకు సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు.
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ భయాలు తగ్గడం, ఇంకా అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు అంచనాలపై స్పష్టత రావడం అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. గత వారంలో బంగారం ధరల్లో బలమైన ప్రాఫిట్ బుకింగ్ నెలకొంది. దీని వల్ల పసిడి రేటు పడిపోయిందని చెప్పుకోవచ్చు. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర జూన్ 2024 ఎక్స్‌పైరీ రూ. 71,486 వద్ద క్లోజ్ అయ్యింది. పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. ఏప్రిల్ 12 నాటి రూ. 73,958 గరిష్ట స్థాయి నుంచి చూస్తే.. గోల్డ్ రేటు ఏకంగా రూ. 2472 వరకు దిగి వచ్చిందని చెప్పుకోవచ్చు.
ఇది సానుకూల అంశం. దాదాపు పసిడి రేటు 3.35 శాతం పతనమైంది. గ్లోబల్ మార్కెట్‌లో చూస్తే.. బంగారం ధర 2349 డాలర్ల వద్ద ఉంది. ఔన్స్‌కు ఈ రేటు వర్తిస్తుంది. బంగారం లైఫ్ టైమ్ గరిష్ట స్థాయి 2448 డాలర్ల నుంచి చూస్తే గోల్డ్ రేటు దాదాపు 4 శాతం మేర దిగి వచ్చిందని చెప్పుకోవచ్చు. మార్కెట్ నిపుణుల ప్రకారం చూస్తే.. గోల్డ్ రేటు కీలకమైన రూ. 72,300 స్థాయి కిందకు పడిపోయింది. ఇప్పుడు బంగారం ధరలకు రూ. 70,500 వద్ద బలమైన మద్దతు లభిస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో చూస్తే.. బంగారం ధరలకు 2300 డాలర్ల వద్ద మద్దతు లభిస్తోంది. ఈ స్థాయి నుంచి బంగారం ధరలు మళ్లీ పైకి చేరొచ్చు. కానీ ఇక్కడ అమెరికా డాలర్ రేట్లును గమనించాల్సి ఉంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ మళ్లీ 106 సైకలాజికల్ మార్క్‌కు చేరింది. దీని వల్ల బంగారం ధరలపై ఒత్తిడి నెలకొందని చెప్పుకోవచ్చు. దీని వల్ల బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అనుకుంటున్నారు. అందువల్ల గోల్డ్ రేట్లు ఎలా కదులుతాయో చూడాల్సి ఉంది. ఇకపోతే మరో వైపు హైదరాబాద్‌లో చూస్తే.. ఏప్రిల్ 27న బంగారం ధరలు నేడు రూ. 66,650 వద్ద ఉన్నాయి. అదే 24 క్యారెట్ల గోల్డ్ రేటు అయితే రూ. 72,710 వద్ద ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. రూ. 54,530 వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.