బంగారం పై బంపర్ ఆఫర్, ఈ విషయం తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు.
భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనేటప్పుడు చూసేది ధర, గతంలో ధర ఎలా ఉంది, భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం బంగారం ధరలు మండిపోతున్నాయి. ప్రతి ఏడాది గోల్డ్ ధరల్లో గణనీయమైన మార్పులు చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే జనం బంగారం షాపుల బాట పట్టి బంగారు ఆభరణాలు తెగ కొనేస్తున్నారు.
అయితే కొన్న తర్వాత ఈ బంగారాన్ని జాగ్రత్తగా దాచుకోవడం అనేది పెద్ద టాస్క్. బంగారం పట్ల ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా దొంగిలించబడే అవకాశం ఉంటుంది. బంగారం రేట్లు బాగా పెరగడంతో కేటుగాళ్లు చూపు ఆభరణాలపైనే పడుతోంది. అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలి. అయితే ఒకవేళ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీ బంగారం పోయినపుడు జువెల్లరీ షాపు వాళ్ళు తిరిగి మీ డబ్బు వాపస్ చేస్తారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎస్.. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నా చాలా జువెల్లరీ షో రూమ్స్ మీరు కొనే బంగారంపై ఉచిత ఇన్సూరెన్స్ ఇస్తున్నారు.
ముందుగానే తమ కంపెనీల్లోని వివిధ బంగారు నగలపై ఇన్సూరెన్స్ చేస్తుంటాయి సదరు షో రూమ్స్. కస్టమర్లకు ఉచితంగానే ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాయి. మీరు నగలు కొనుగోలు చేసిన తర్వాత ఏడాదిలోపు పోగొట్టుకున్నా, చోరీ జరిగినా తిరిగి మీ డబ్బులు వాపస్ వస్తాయి. అగ్నిప్రమాదం, దాని అనుబంధ ప్రమాదాలు, భూకంపం, వరదలు వంటి ప్రకృతి విపత్తుల వల్ల బంగారం పోగొట్టుకుంటే ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది.
దొంగించబడిన సందర్భాల్లో కూడా ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది. అంటే మీ బంగారు నగ చోరీకి గురైనప్పుడు ముందుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి.. నాన్ ట్రేజబుల్ సర్టిఫికెట్ తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీలకు అందజేయాలి. అప్పుడు మీ బంగారానికి సమానమైన డబ్బు తిరిగి ఇచ్చేస్తారు. చాలా రకాల జువెల్లరీ షో రూమ్స్ ఈ ఇన్సూరెన్స్ అందిస్తున్నప్పటికీ.. కొన్ని కండిషన్స్ మాత్రం పెట్టారు.
ఎంపిక చేయబడిన కొన్ని ఆభరణాలు, రూ.10 వేల కన్నా ఎక్కువ ఉన్న నగలకు మాత్రమే ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి పలు కంపెనీలు. కాబట్టి బంగారం కొనేముందు ఈ విషయాలు అడిగి మరీ తెలుసుకుంటే చాలా ఉపయోగం. గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన గోల్డ్ రేట్లు ప్రస్తుతం కొండెక్కి కూర్చున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా బంగారం ధరల పెరుగుదలకు బ్రేకులు పడడటం లేదు. పైపైకి పోతున్న గోల్డ్ రేట్లు ఇప్పుడు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి.