గ్లకోమా వ్యాధి లక్షణాలు ఇవే, నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు పోయే ప్రమాదం.
ప్రపంచవ్యాప్తంగా గ్లాకోమా వ్యాధి చాపకిందనీరులా విస్తరిస్తోంది. ఎక్కువ మంది అంధులవ్వడానికి రెండో సాధారణ కారణం గ్లాకోమా. ఇందులో ఆప్టిక్ నర్వ్ దెబ్బతినడం వల్ల చూపు కోల్పోతారు. అయితే గ్లాకోమా గురించి ప్రజల్లో సరైన అవగాహన ఉండటంలేదు. చాలామందిలో అపోహలు ఎన్నో ఉన్నాయి. గ్లాకోమా వ్యాధి ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. సాధారణంగా కంటిపరీక్షల ద్వారా మాత్రమే ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. అయితే కంటికి సంబంధించిన వ్యాధుల్లో గ్లకోమా ఒకటి.
ఎటువంటి లక్షణాలు కనిపించకుండా 90 శాతం చూపును పోగొడుతుంది. ప్రతి ఒక్కరూ ఏడాది ఒకసారైనా కంటి పరీక్షలు చేయించుకోవాలి. గ్లకోమా అంటే ఏంటి.. మయో క్లినిక్ ప్రకారం గ్లకోమా అనేది ఆప్టిక్ నాడిని దెబ్బతీసే పరిస్థితి. ఇది కంటి నుంచి మెదడుకి సంకేతాలు పంపిస్తుంది. మంచి దృష్టికి ఆప్టిక్ నాడి చాలా ముఖ్యమైనది. కంటికి అధిక ఒత్తిడి తగిలినప్పుడు ఈ నరాలు దెబ్బతింటాయి. అలా జరగడం వల్ల కంటి చూపు మందగిస్తుంది. గ్లకోమా కారణాలు ఏంటి.. 60 ఏళ్లు పైబడిన వారిలో గ్లకోమా అంధత్వానికి దారితీస్తుంది.
అయితే గ్లకోమా వల్ల వచ్చే అంధత్వాన్ని ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే కంటి చూపు పోకుండా కాపాడుకోవచ్చు. క్లీవ్ ల్యాండ్ క్లినిక్ ప్రకారం గ్లకోమా అనేది వయస్సు సంబంధిత కంటి సమస్య. సుమారు మూడు మిలియన్ల మంది అమెరికన్లని ఇది ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తమగా కంటి శుక్లం తర్వాత అంధత్వానికి ఇది రెండో ప్రధాన కారణం. ఎటువంటి కారణం లేకుండా కూడా గ్లకోమా సంభవిస్తుంది. అయితే దీని ప్రభావితం చేసే అంశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో మొదటిది కంటి మీద ఒత్తిడి. కంటి లోపల ఐవోబి అనేది డ్యామేజ్ అవడం వల్ల నరాలు దెబ్బతిని చూపుని కోల్పోవడం జరుగుతుంది.
గ్లకోమా లక్షణాలు.. తీవ్రమైన కంటి నొప్పి, తీవ్రమైన తలనొప్పి, వికారం లేదా వాంతులు, అస్పష్టమైన దృష్టి, కాంతి చూడలేకపోవడం, కళ్ళు ఎర్రబడటం. గ్లకోమా ప్రమాద కారకాలు.. మయో క్లినిక్ ప్రకారం కొన్ని లక్షణాలు కనిపించే లోపే గ్లకోమా దృష్టిని దెబ్బతీస్తుంది. అందుకే మీలోని ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై వైద్యులను కలవడం చాలా ముఖ్యం. కంట్లో ఒత్తిడి. మీ వయస్సు 55 కంటే ఎక్కువగా ఉంటే కంటి పరీక్షలు తప్పనిసరి. కళ్ళు నల్లగా మారిపోవడం. కుటుంబంలో ఎవరికైనా గ్లకోమా ఉంటే జాగ్రత్త పడాలి.
మధుమేహం, మైగ్రేన్, అధిక రక్తపోటు, అనీమియా వంటి కొన్ని వైద్య పరిస్థితులు. కార్నియాస్ దెబ్బతినడం. దూరదృష్టి లేదా దగ్గర వస్తువులు చూడలేకపోవడం. కంటి గాయం లేదా కొన్ని రకాల కంటి శస్త్ర చికిత్సలు. కార్టికో స్టెరాయిడ్ మందులు, కంటి చుక్కలు ఎక్కువ కాలం పాటు తీసుకోవడం. గ్లకోమా నివారణ ఎలా.. గ్లకోమాను ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. అందుకే క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఐ డ్రాప్స్ వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. కళ్ళు దెబ్బతినకుండా రక్షించుకోవాలి.