అమ్మాయిలు ఎవరికీ చెప్పకుండా దాచే సీక్రెట్స్ ఇవే.
అబ్బాయిలు అమ్మాయిల గ్యాంగ్ చాట్ గురించి అస్సలు అడగకూడదు. అమ్మాయిలు తన స్నేహితులతో ఎన్నో విషయాలను పంచుకుంటారు. ఆ చాట్ గురించి కానీ తన స్నేహితుల సీక్రెట్ల గురించి కానీ అమ్మాయిలు స్నేహితులతో చాట్ చేసిన విషయాల గురించి చర్చను కానీ అస్సలు ఇష్టపడరు. అమ్మాయిలను ప్రేమించిన అబ్బాయిలు క్రష్ గురించి అడిగితే నిజాలు చెప్పరు. అయితే అమ్మాయిలు బయట పెట్టే విషయాలు వాళ్లకు సంబంధించినవి అయి ఉండవు.
ఇతరుల విషయాలు మాత్రమే దాచుకోకుండా బయటికి చెప్పే అమ్మాయి.. కొన్ని వాళ్లకు సంబంధించిన విషయాలను మాత్రం ఎవరికీ చెప్పకుండా మనసులోనే దాచుకుంటారు. అలా దాచేది కేవలం బయటి వారితోటే కాదు సుమా…ఇంట్లో వాళ్ల దగ్గర కూడా చాలా విషయాలు చెప్పరు. తల్లి, తండ్రి, తోబుట్టువులు ,భర్త, స్నేహితులతో ..ఇలా దగ్గరగా ఉన్న వారితో కూడా వారు చాలా విషయాలు పంచుకోరు.
భార్య భర్త దగ్గర అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది అని చాలామంది అపోహ పడతారు. నిజానికి మెజారిటీ సందర్భాల్లో ఎక్కువ సీక్రెట్లు దాచి పెట్టేది భర్త దగ్గర. తమ వయసు గురించి అడిగితే అమ్మాయిలు ఇక అక్కడి నుంచి పరారే. ఎప్పుడు వయసు తక్కువగా ఉన్నట్లు కనిపించడం కోసం వారు అవసరమైతే జీవనశైలిని కూడా మార్చుకుంటారు.
ఎగ్జామ్ బాగా రాసిన ఏమో బాగా రాయలేదు నేను ఫెయిల్ అయిపోతానేమో అని అమ్మాయిల శాతమే ఎక్కువ ఉంటుంది. అదే అబ్బాయిలు తెల్ల కాగితం ఇచ్చి వచ్చిన ఏదో రాసి వచ్చిన బిల్డప్ ఇస్తారు. అలాగే అమ్మాయిలు తమ బరువు గురించి ఎవరితో డిస్కస్ చేయడానికి ఇష్టపడరు. ఎంత సన్నగా ఉన్న అమ్మాయి అయినా సరే ఎప్పుడూ తనని తాను లావుగానే ఊహించుకుంటుంది.
అలాగే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ గురించి కూడా పెద్దగా బయటకు చెప్పుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వరు. అందానికి పెద్దపీట వేసి అమ్మాయిలు తాము వాడే బ్యూటీ సీక్రెట్స్ ఎవరికీ చెప్పడానికి ఇష్టపడరు. మాయిశ్చరైజర్ దగ్గర నుంచి కన్జ్యూలర్ వరకు పూర్తిగా సీక్రెట్ గా ఉంచి…అసలు ఎటువంటి ప్రొడక్ట్స్ వాడనట్టు… నేను నాచురల్ బ్యూటీ అని అంటారు.