Health

చిన్న వయసులోనే ఆడపిల్లలు ఎందుకు రజస్వల అవుతున్నారో తెలుసా..?

మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదుగుదలలో ముందుంటారు. ఆడపిల్లకి పదేళ్లు రాగానే వారిలో శారీరకమైన మార్పులు మొదలవుతాయి. ఛాతీ పెరగడం ప్రారంభమవుతుంది. అంతేకాదు వైట్ డిశ్చార్జ్ కూడా కొన్ని నెలల పాటూ సాగుతుంది. చివరికి వారు రజస్వల అవుతారు. పదేళ్ల వయసులో మొదలైన ప్రక్రియ రెండు మూడేళ్ల పాటూ కొనసాగి అప్పుడు రజస్వల అయ్యేవారు ఒకప్పుడు. ఇది బాల్యానికి చివరి దశ. రజస్వల అయ్యారు అంటే అర్థం వారి హైపోథాలమస్, పిట్యూటరీ, అండాశయాలు పరిపక్వ స్థితికి చేరుకున్నాయి అని అర్థం.కానీ పదేళ్లు, పదేళ్ల కన్నా తక్కువ వయసులో పిల్లలు రజస్వల కావడం మాత్రం అసాధారణమే.

ఏడు,ఎనిమిదేళ్ల ఆడపిల్లలు రజస్వల అయితే ఆ పరిస్థితిని ‘ప్రికాషియస్ ప్యూబర్టీ’ అంటారు. అయితే మారిన జీవనశైలో కారణమేదైనా గాని ఈమధ్య 8 సంవత్సరాలు లేదా తొమ్మిది ఏళ్ళకే ఆడపిల్లలు రజస్వలవుతున్నారు. అయితే ఇది ఏ వయసులో అవ్వాలి అనేదానికి ఖచ్చితమైన ఆధారాలు ఏమీ లేకపోయినప్పటికీ పది సంవత్సరాలు దాటిన తర్వాత అమ్మాయిలు ఎప్పుడైనా సరే రజస్వల అయ్యే అవకాశాలు ఉంటాయి. నిజానికి 12 ఏళ్లు దాటిన తర్వాత రజస్వాలైతే అది ఆరోగ్యమే.. 10 సంవత్సరాల లోపు గనుక అయితే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఆడపిల్ల పుట్టింది అని కొంతమంది అతిగారాభం చేస్తూ ఉంటారు.

దానివల్ల జంక్ ఫుడ్ తినడం శారీరక వ్యాయామం లేకపోవడం దాంతో ఒళ్ళు కూడా కాస్త పెరిగి ఉబకాయానికి దారి తీయడం చిన్న వయసులోనే హార్మోన్ల సమతుల్యత ఏర్పడడం వంటి కారణాలవల్ల పదేళ్ల లోపు పిల్లలే రజస్వల ఆవ్వడం జరుగుతుంది.గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకు సిటీస్లో ఉండే పిల్లలకు కంపేర్ చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆడపిల్లలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అందుకే అక్కడ అమ్మాయిలు కాస్త ఆలస్యంగానే అవుతుంటారు. ఇలా 10 సంవత్సరాల కంటే ముందే రజస్థులైన అమ్మాయిలు విషయంలో కొంచెం ఆందోళన చెందాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తొందరగా రజస్వల అయితే తొందరగా పిసిఒడి సమస్య ఎదుర్కొనే అవకాశాలుంటాయి.

ఇలా అవ్వకుండా ఉండాలంటే దుంపలు, పంచదార తగు మోతాదులో మాత్రమే తీసుకుంటూ ఉండాలి. రజాస్వాళ త్వరగా అయ్యే అమ్మాయిలు ఒంటరితనం వ్యక్తిత్వ సమస్యలు త్వరగా లైంగిక చర్యలో పాల్గొనడం లాంటి ముప్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నాయి. అందుకే ఈ వయసులో పిల్లలకు ఎక్కువగా తల్లి తోడుగా ఉంటూ ఉండాలి. మానసికంగా శారీరకంగా వారు ఎదుగుదలకు తల్లి వారికి సంరక్షకురాలుగా ఉండాలి. అంతేకాకుండా ఎక్కువగా ఫోన్ ని అలవాటు చేయకుండా ఉండాలి. ఆ ఫోన్లో వాళ్ళు ఎటువంటి కంటెంట్ చూస్తున్నారు అనే విషయాలు కూడా తల్లి గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ వయసులో ఆరు ముందు చేంజ్ అవుతుంటాయి.

కాబట్టి వాళ్లని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత తల్లిది. సమయంలో కడుపునొప్పి నుంచి బయటపడడానికి అరటి పండు లోని మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ మీ పేరు కదలికలను చెక్కుచెదరకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఇది మూడు రిలాక్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక నారింజ నారింజలో విటమిన్ డి కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఆందోళన చిరాకు ఇటువంటి వాటి నుండి కూడా ఉపశమనం పొందొచ్చు. అలాగే నిమ్మ దానిమ్మ ద్రాక్ష వంటి నారింజలాగే పనిచేస్తాయి. వీటిలో ఏవైనా సరే తీసుకోవచ్చు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే పదిహేనులో పది రజస్వల అవ్వకుండా పిల్లల్ని కాపాడుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker