Health

ఈ నూనెను ఇలా చేసి వాడితే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో అర చెంచా అల్లం నూనెను కలిపి ఉదయం పరగడుపున తాగితే.. శరీరంలో పేరుకుపోయిన విషయ వర్గాలను బయటకు నెట్టు వస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో రెండు లేదా మూడు చుక్కల అల్లం నూనెను యాడ్ చేసుకుని సేవించాలి. ఇలా ప్ర‌తి రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకుంటే గ‌నుక‌.

శరీరంలో పేరుకు పోయిన టాక్సిన్స్ మరియు అదనపు కొవ్వు తొలిగి పోతుంది. అతి ఆక‌లి దూరంగా అవుతుంది. త‌ద్వారా క్ర‌మంగా బ‌రువు త‌గ్గుతాయి. అయితే ఒక గిన్నెలో బాగా వేడి నీటిని తీసుకుని. అందులో నాలుగు చుక్క‌లు అల్లం నూనెను వేసి ఆవిరి పట్టాలి. ఇలా చేస్తే జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి, శ్వాస కోశంలో వాపు వంటి స‌మ‌స్య‌లు దెబ్బకిపోతాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, చర్మ క్యాన్సర్ యొక్క చెడు ప్రభావాలను తగ్గించడంలో అల్లం నూనె ప్రభావంతగా పనిచేస్తుంది.

అల్లం నూనె వయస్సు సంబంధిత ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. అల్లం ఎసెన్షియల్ ఆయిల్ ట్రీట్‌మెంట్ అల్సర్‌లను 85% నిరోధిస్తుంది. అల్లం నూనెను తీసుకున్న తర్వాత నెక్రోసిస్, ఎరోషన్, గ్యాస్ట్రిక్ వాల్ యొక్క రక్తస్రావం వంటి ఇథనాల్ ప్రేరిత గాయాలు గణనీయంగా తగ్గాయని పరీక్షల్లో తేలింది. ఈ ఆయిల్‌ను ముక్కు ద్వారా పీల్చినప్పుడు వికారం తగ్గిస్తుంది.. ఊపిరితిత్తుల నుండి శ్లేష్మాన్ని తొలగించే సామర్థ్యాన్ని ఈ ఆయిల్‌ కలిగి ఉంది.

జలుబు, ఫ్లూ, దగ్గు, ఆస్తమా వంటి వాటికి సహజ నివారణిగా ఈ ఆయిల్‌ను వాడుకోవచ్చు. అంటువ్యాధులను నయం చేయటంతోపాటు, జెర్మ్స్‌ను చంపే గుణం అల్లం నూనెకు ఉంది. దీనిని యాంటిసెప్టిక్‌గా ఉపయోగించవచ్చు. అల్లం నూనెను నోటి ద్వారా తీసుకున్నప్పుడు, పేగు ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి వాటి నుండి రక్షణగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో మూడు చుక్కలు అల్లం నూనె వేసి తాగితే.. జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది. గ్యాస్, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు ద‌రి చేరవు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker