Health

Ghee Navel: స్నానానికి ముందు బొడ్డు చుట్టూ నెయ్యితో ఇలా చేస్తే చాలు. మీరు ఊహించని ఫలితాలు చూస్తారు.

Ghee Navel: స్నానానికి ముందు బొడ్డు చుట్టూ నెయ్యితో ఇలా చేస్తే చాలు. మీరు ఊహించని ఫలితాలు చూస్తారు.

Ghee Navel: నాభిపై నెయ్యి వేసి మర్దన చేసుకొని స్నానం చేస్తే స్లీప్ క్వాలిటీ మెరుగుపడుతుంది. ఈ పురాతన విధానం స్లీప్ ప్యాటర్న్‌లను రెగ్యులేట్ చేసి ఒత్తిడి, ఆందోళన‌లను తగ్గిస్తుంది. శరీరం, మెదడుకు తగినంత విశ్రాంతినిచ్చి రిఫ్రెష్ చేస్తుంది. అయితే స్నానం చేసే ముందు నాభికి నెయ్యి రాస్తే చాలట. దీనివల్ల ఎన్నో లాభాలు ఉంటాయంటున్నారు. చర్మానికి.. నెయ్యిని నాభికి అప్లై చేస్తే.. చర్మం పొడిబారడం తగ్గుతుంది. నెయ్యి చర్మాన్ని మృదువుగా, మాయిశ్చరైజ్ చేస్తుంది. పొడి చర్మాన్ని దూరం చేస్తుంది. స్కిన్ ఇరిటేషన్ తగ్గుతుంది.

Also Read: : మంచిదని పచ్చివెల్లుల్లి ఎక్కువగా తింటున్నారా.?

దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని మృదువుగా చేసి.. ఇరిటేషన్​తో పాటు వాపును తగ్గిస్తాయి. జుట్టు పెరుగుదలలో కూడా మంచి మార్పులుంటాయి. జీర్ణశయానికి.. నెయ్యిని బొడ్డుపై అప్లై చేయడం వల్ల మెరుగైన జీర్ణక్రియ మీ సొంతమవుతుంది. అలాగే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం కూడా తగ్గుతుంది. దీనిలోని యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు గాయలను త్వరగా తగ్గిస్తాయి.

మానసిక ప్రయోజనాలివే..నెయ్యిని నాభికి అప్లై చేస్తే.. మీలో పాజిటివ్ ఫీలింగ్ పెరుగుతుందట. అలాగే.. ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గుతుందని చెప్తున్నారు. అన్నివేళలా పాజిటివ్​గా ఉండడంలో హెల్ప్ అవుతుంది. ఎమోషనల్​గా బ్యాలెన్స్​గా ఉంటారు. ఆయుర్వేదంలో ఇది ఆధ్యాత్మికతకు గుర్తుగా చెప్తారు. నాభి అనేది శరీరంలోని ఆత్మకు కనెక్ట్ అయి ఉంటుందంటారు. నాభికి నెయ్యి అప్లై చేయడం వల్ల ఆత్మకు అభిషేకం చేసినట్టేనని భావిస్తారు. మహిళలకు మరిన్ని ప్రయోజనాలు.. పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు నాభికి నెయ్యి అప్లై చేయడం వల్ల క్రాంప్స్ వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది.

Also Read: ఉదయాన్నే ఖాళీకడుపుతో స్పూన్ నెయ్యి తింటే..

కడుపు ఉబ్బరం, మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. ఫెర్టిలిటీ సమస్యలపై కూడా ఇది సానుకూల ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు దీనిలో నెయ్యిలో ఉన్నాయి. ఎలా అప్లైచేయాలంటే..తక్కువ మోతాదులో నెయ్యి తీసుకుని దానిని వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉంటే సరిపోతుంది. దానిలోని రెండు మూడు చుక్కలను తీసుకుని నాభిపై అప్లై చేయాలి. సున్నితంగా చర్మంలోపలికి వెళ్లేలా మసాజ్ చేయాలి. స్నానం చేసే పావుగంట ముందు రాస్తే మంచిది. అరగంట సేపు కూడా ఉంచుకోవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker