Health

Ghee: ఈ సమస్యలు ఉన్నవారు నెయ్యి అస్సలు తినకపోవడమే మంచిది, ఎందుకంటే..?

Ghee: ఈ సమస్యలు ఉన్నవారు నెయ్యి అస్సలు తినకపోవడమే మంచిది, ఎందుకంటే..?

Ghee: రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున నెయ్యి తింటే జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. జీర్ణాశ‌యంలో అగ్ని పెరుగుతుంది. దీంతో తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య‌లు కూడా బాధించ‌వని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వారు నేడు మ‌న దేశంలో చాలామందే ఉన్నారు. అయితే నెయ్యి ని మనం పాల నుంచి తయారు చేస్తాం. నెయ్యి ఆరోగ్యానికి మంచిది అని , కచ్చితంగా ఒక స్పూన్ అయినా తినాలి అని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు.

Also Read : రోజు ఖాళీ కడుపుతో ఓ చెంచా నెయ్యి తింటే చాలు, జీవితంలో ఎలాంటి జబ్బులు మీ జోలికిరావు

మనం కూడా పిల్లలకు ఇంట్లో భోజనం పెడితే.. కచ్చితంగా నెయ్యి వడ్డించే పెడుతూ ఉంటాం. కానీ.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం.. నెయ్యి తినకూడదట. లివర్ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా నెయ్యిని తీసుకోకూడదట. నెయ్యి తినడం వల్ల లివర్ సంబంధిత సమస్యలురావు. కానీ.. లివర్ సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం నెయ్యి తీసుకోకూడదు. తీసుకుంటే.. వీరికి జాండీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట. నిజానికి కడుపుతో ఉన్న స్త్రీలు.. కచ్చితంగా తమ డైట్ లో నెయ్యి భాగం చేసుకోవాలి.

కానీ.. ఒకవేళ వారికి ఏవైనా ఆహారం అరుగుదల సమస్యలు ఉంటే.. వారు నెయ్యికి దూరంగా ఉండటమే మంచిది. లేదంటే… మలబద్దకం, గ్యాస్ తదితర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నెయ్యిలో కొలిస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కాస్త నెయ్యికి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే.. అందులోనే ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వారు నెయ్యి తీసుకుంటే.. అది హార్ట్ ఫెయిల్యూర్ కి కారణం అయ్యే ప్రమాదం ఉంది. ఇక.. ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యలతో బాధడుతున్నారు.

Also Read : నెయ్యిని ఇలా బొడ్డులో వేసి చూశారా..! ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసుకోండి.

బరువు తగ్గాలి అని డైట్ చేసేవారు నెయ్యికి దూరంగా ఉంటే మంచిది. రోజుకి రెండు స్పూన్లకు మంచి ఎక్కువ నెయ్యి తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకుంటే.. వారికి బరువు తగ్గడం కష్టంగా మారుతుంది. ఇక.. కొందరికి మొటిమల సమస్య ఉంటుంది. అవి వారిని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటివారు నెయ్యి తీసుకోవడం వల్ల.. ఆ మొటిమల కౌంట్ మరింత పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి… మొటిమలు వంటి సమస్యలు ఉన్నవారు వాటిని తినకపోవడమే మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker