ఘంటసాల ఫ్యామిలీలో విషాదం, ఏం జరిగిందంటే..?

ఘంటసాల ఫ్యామిలీలో విషాదం, ఏం జరిగిందంటే..?

గత కొంతకాలంగా ఆయన చెన్నైలోని కావేరీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితమే ఆయనకు కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. అయితే చాలా కాలంగా ఘంటసాల రత్నకుమార్ కిడ్నీ సమస్యతో డయాలసిస్ పై ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘంటసాల అమర గాయకుడిగా పేరు గడిస్తే, ఆయన కుమారుడైన రత్నకుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది ఇప్పటికే కరోనా కారణంగా అనేక మంది ని కోల్పోయిన టాలీవుడ్ ఇప్పుడు అనారోగ్య కారణంగా చాలామందిని దూరం చేసుకుంటోంది.

ఇక తాజాగా ఘంటసాల రెండో కుమారుడు రత్నకుమార్ కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన దాన్నుంచి కోలుకున్నారు. కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చినా సరే గుండెపోటుతో చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో కన్నుమూసినట్లు తెలుస్తోంది.

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజుల నుంచి డయాలసిస్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు గుండె నొప్పి రావడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. తండ్రి వారసుడిగా సినీ రంగంలోకి వచ్చిన ఆయన 32 ఏళ్లుగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా సినీ రంగానికి సేవలు అందిస్తున్నారు. దాదాపు 1100 సినిమాలకు పైగా ఆయన డబ్బింగ్ చెప్పినట్లు అలాగే ఎనిమిది గంటలపాటు సుదీర్ఘంగా డబ్బింగ్ చెప్పి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *