కలవరపెడుతున్న ‘జీబీఎస్’ వైరస్, పెరుగుతున్న మరణాల సంఖ్యా. వీటి లక్షణాలు తెలిస్తే..?
దేశంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాళ్ రాష్ట్రాల అనంతరం, జీబీఎస్ అనే కొత్త రకం వైరస్ రాష్ట్రంలో వెలుగు చూసింది. తిరువళ్లూరు సమీపంలోని తిరువూరు ఎంజీఆర్ నగర్‌కు చెందిన ప్రేమ్‌కుమార్ కుమారుడైన వైదీశ్వరన్ (9) అదే ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆదిద్రావిడుల సంక్షేమ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. గత నెల 22వ తేదీ ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరగా వైదీశ్వరన్ కాళ్లు కదపలేక ఇబ్బందుల పాలయ్యాడు.
అయితే ఆరోగ్య శాఖ అధికారుల ప్రకారం, 31 మంది రోగులు పూణే మునిసిపల్ కార్పొరేషన్ నుండి, 83 మంది రోగులు సింహగడ్ రోడ్, కిర్కిట్వాడి, నందోషి అదే ప్రాంతంలోని కొన్ని గ్రామాలకు చెందినవారుగా గుర్తించారు. వీరితో పాటు, 18 మంది రోగులు పింప్రి చిన్చ్వాడ్ నుండి, 18 మంది రోగులు పూణే గ్రామీణ ప్రాంతానికి చెందినవారు. 8 మంది రోగులు ఇతర జిల్లాలకు చెందినవారు. ఇప్పటివరకు 38 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. అదే సమయంలో, 21 మంది రోగులు వెంటిలేటర్‌పై ఉన్నారు.
మహారాష్ట్రలో గిలియన్-బారే సిండ్రోమ్ (GBS) కారణంగా మరణించిన వారి సంఖ్య మంగళవారం నాటికి 7 కి పెరిగింది. ఈ విషయంలో ఆరోగ్య శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. జనవరి 31న చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్‌లో చేరిన పదేళ్ల బాలుడు మంగళవారం మరణించాడు. తమిళనాడులో తొలి గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (GBS) బాధితుడిగా నిర్ధారించారు. గత నెల నుండి ఈ అరుదైన వ్యాధి ఇన్ఫెక్షన్ వల్ల సంభవించిన మరణాల సంఖ్య ఏడుకి చేరుకుంది. దేశవ్యాప్తంగా GBS మరణాలకు కారణం మహారాష్ట్ర పూణెలోని క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బాక్టీరియం వ్యాప్తికి కారణమనిఆ ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు.
పూణే నగరంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక నీటి నమూనాలను రసాయన, జీవ విశ్లేషణ కోసం ప్రజారోగ్య ప్రయోగశాలకు పంపారు. దర్యాప్తులో, ఎనిమిది నీటి వనరుల నుండి వచ్చిన నమూనాలు కలుషితమైనట్లు గుర్తించారు. పుణె నగరంలోని వివిధ ప్రాంతాల నుండి మొత్తం 160 నీటి నమూనాలను రసాయన, జీవ విశ్లేషణ కోసం ప్రయోగశాలకు పంపినట్లు ఒక అధికారి తెలిపారు. సింహగడ్ రోడ్ ప్రాంతంలోని కొన్ని ప్రైవేట్ బోర్‌వెల్‌ల నుండి తీసిన నమూనాలలో ఒకదానిలో ఎస్చెరిచియా కోలి లేదా ఇ-కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు కనిపించిందని అధికారి తెలిపారు. నీటిలో ఈ-కోలి ఉండటం అనేది మలం లేదా జంతువుల వ్యర్థాల నుండి వచ్చే మురికి వ్యాప్తికి సూచన అని ఆయన అన్నారు. ఇది GBS ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందన్నారు.