News

ఆ హీరోయిన్లు ఇష్టంతోనే కమిట్మెంట్ ఇస్తున్నారు. నటి గాయత్రి సంచలన వ్యాఖ్యలు.

ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్‌గా యాక్ట్‌ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొబ్బరి మట్ట, ఐస్‌క్రీమ్‌ 2, మిఠాయి లాంటి చిత్రాల్లో నటించింది. సినిమాలతో కన్నా వివాదాలతో బాగా పాపురల్‌ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని.. అవకాశాల కోసం బెడ్‌ రిలేషన్‌ పెట్టుకుంటారని చెప్పుకొచ్చింది. అయితే సినీ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి వినిపిస్తున్న టాపిక్ క్యాస్టింగ్ కౌచ్.

అయితే దీని పై చాలా మంది తమ అభిప్రాయాలను, చేదు అనుభవాలను కూడా పంచుకున్నారు. అయినప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉందా లేదా అన్నది అనుమానంగానే ఉంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ నిర్మాత ఇలా అని.. ఈ దర్శకుడు అలా అని చాలా మంది చెప్పుకొచ్చారు.

తాజాగా ఓ యువనటి కూడా క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ నటి ఎవరో కాదు గాయత్రీ గుప్తా. ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన గాయత్రి గుప్తా. గతంలో చాలా కాంట్రవర్సీల్లో కనిపించింది. తాజాగా ఆమె క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ విషయం చెప్పుకొచ్చింది. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. కొంతమంది హీరోయిన్స్ ఆఫర్స్ కోసం కమిట్ మెంట్ ఇస్తున్నారు.

హీరోయిన్స్ ఆఫర్స్ కోసం చేస్తుంటే అది అవతలి వారికి ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పుకొచ్చింది గాయత్రీ. చాలా మంది హీరోయిన్స్ ఇష్టంతోనే కమిట్మెంట్ ఇస్తున్నారు. కొందరు మాత్రమే ఇష్టం లేకపోయినా ఆఫర్స్ కోసం కమిట్మెంట్ ఇస్తున్నారు. అలా మోసపోయినవారు చాలా మంది ఉన్నారు అంటూ గాయత్రి గుప్తా ఓపెన్ గా చెప్పుకొచ్చారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker