గ్యాస్ సమస్య పదే పదే వేధిస్తోందా..? ఇదిగో పరిష్కారం..!
మనలను వివిధ రకాల ఇబ్బందులకు, అసౌకర్యానికి గురిచేసే జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యల్లో గ్యాస్ ట్రబుల్ ప్రధానమైనది. గ్యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే వ్యాధి. అయితే తులసి కడుపులో మంట లేదా ఎసిడిటీకి సైతం దీన్ని మందుగా ఉపయోగించవచ్చు. గ్యాస్ నొప్పివస్తుందని మీకు అనిపించగానే కొన్ని తులసి ఆకులను నమలడం ద్వారా ఎసిడిటీ తగ్గుతుంది. ఆలా నామాలలేని వాళ్ళు కప్పు నీటిలో నాలుగు నుండి ఐదు తులసి ఆకులు వేసి కొంతసేపు ఆలా ఉండనివాలి.
రోజులో అప్పుడప్పుడూ ఈ నీటిని తాగడం ద్వారా సమస్య తగ్గుముఖం పడుతుంది. ఆహారం తిన్న తర్వాత కొన్ని సోంపు గింజలను నోటిలో వేసుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్య కూడా రాదు. లేదా సోంపు గింజలతో తయారు చేసిన టీ తాగడం ద్వారా ఎసిడిటీ నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. నూనె లేకుండా వేయించిన జీలకర్రను పొడిగా చేయాలి. ఒక గ్లాసు వేణ్నీళ్లలో కొద్దిగా జీలకర్రపొడి కలిపి భోజనం చేసిన తర్వాత తాగాలి. ఇది ఎసిడిటీ సమస్య రాకుండా చేస్తుంది. కడుపులో మంటగా అనిపించిన సందర్భంలోనూ ఈ నీటిని తాగితే ఉపశమనం దొరుకుతుంది.
ఓ చిన్న బెల్లం ముక్క ఎసిడిటీకి మహా ఔషధం లాగా పనిచేస్తుంది. బెల్లం ముక్క తినడం ద్వారా ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందుతాము అంతే కాకుండా మరింత వేగంగా ఫలితం పొందాలంటే చల్లటి నీటిలో బెల్లం కలిపి తాగాల్సి ఉంటుంది. ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే అసలు ఈ సమస్య రాకుండా ఉంటుంది. ఎసిడిటీ నుంచి వెంటనే ఉపశమనం పొందాలి అంటే దాల్చిన చెక్కవేసి తయారు చేసిన టీ తాగాలి.
ఇది ఎసిడిటీ సమస్యను తగ్గించడంతో పాటు జీర్ణవ్యవస్థలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే వాటిని కూడా నయం చేస్తుంది. మజ్జిగ తాగడం వల్ల కడుపులో చల్లగా ఉండటంతో పాటు మంట, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. పైనాపిల్ జ్యూస్ కూడా గ్యాస్ నొప్పి నుంచి తక్షణ ఉపశమనం ఇవ్వడంతో పాటు ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేలా చేస్తుంది. పుదీనా ఆకు సైతం ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది.
దీన్ని ఆహారం లో తీసుకోవడం ద్వారా జీర్ణ ప్రక్రియ మెరుగుపడటంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్య రావడానికి కారణమైన ఆమ్లాల ఉత్పత్తిని నివారిస్తుంది. కొన్ని పుదీనా ఆకులను నమలడం ద్వారా లేదా కొన్ని పుదీనా ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత ఆ నీటిని తాగితే మంచి ఫలితం కలుగుతుంది. మీకెప్పుడైనా ఎసిడిటీ కారణంగా కడుపులో మంట గా ఉన్నప్పుడు ఒక గ్లాసు చల్లని పాలను తాగండి. ఈ పాలు ఎంత చల్లగా ఉంటే అంత త్వరగా అంత బాగా ఉపశమనం లభిస్తుంది. అలాగే పాలల్లో పంచదార, చాక్లెట్ పౌడర్ లాంటివి కూడా కలపకూడదు.