ఈ చిన్న చిన్న జాగర్తలు తీసుకుంటే జీవితంలో గ్యాస్ సమస్యలు రావు.
సాధారణంగా మనం తినే ఆహారంతోగాని, తాగే ద్రవపదార్థాలతోగాని, లాలాజలంతోగాని శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనిలో కొంత భాగం ఆమాశయం నుంచి త్రేన్పు రూపంలో బైటకు వెళ్లిపోతే మిగిలిన భాగం పేగులలోకి ప్రవేశించి, అక్కడనుంచి శరీరంలోకి కలిసిపోతుంది. చివరగా మిగిలిన సూక్ష్మాంశం, నత్రజనితో కలిసి మలద్వారం నుంచి వెలుపలకు గ్యాస్ రూపంలో వెళ్లిపోతుంది. అయితే గ్యాస్ సమస్య మనకు రావడానికి మనం తీసుకునే ఆహారమే అవుతుంది.
కారం, పులుపు, ఉప్పు తదితర వాటిని మనం మోతాదుకంటే ఎక్కువ తీసుకుంటున్నాం. కడుపులో అవి జీర్ణం కాకపోతే యాసిడ్ ఎక్కువ ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. అలా ఉత్పత్తి అయిన యాసిడ్ మంట రూపంలో పైకి ఎగుస్తుంది. దీంతోనే మనకు కడుపులో మంట వస్తుంది. గొంతులో మంటకు కారణమవుతుంది. గ్యాస్ సమస్యలను తగ్గించుకోవడానికి అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
ఎండోస్కోపి ద్వారా గ్యాస్ సమస్యలను గుర్తించవచ్చు. గ్యాస్ సమస్యలు రాకుండా ఉండాలంటే మజ్జిగ బాగా పనిచేస్తుంది. పులిసిన మజ్జిక కాకుండా అప్పుడే తయారు చేసుకున్న మజ్జిగ తీసుకుంటే ప్రయోజనం. దీంతో మనకు గ్యాస్ సమస్యలు అదుపులోకి వస్తాయి. జీ జంక్షన్ ను బిగుతుగా ఉంచేందుకు కొన్ని చర్యలు తీసుకుంటే మంచిది. ప్రతి రోజు సమయం ప్రకారం తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ ఇబ్బందులను దూరం చేసుకోవడానికి మార్గాలు అన్వేషించుకోవాలి.
పడుకునేటప్పుడు ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. తలకింద దిండు పెట్టుకోవాలి. గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంటే వైద్యుడి పర్యవేక్షణలో ఉండటం మంచిది. గ్యాస్ సమస్యలు రాకుండా చేసుకోవడానికి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మసాలాలు లేకుండా చూసుకోవాలి. ఉడకని ఆహారాలు తీసుకుంటే ఇంకా ప్రయోజనం. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటివి తమ ఆహారాల్లో చేర్చుకోవాలి. గ్యాస్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు మనం తీసుకున్న ఆహారాలు ఉపయోగపడతాయి.