తిన్న తర్వాత గ్యాస్ వస్తుందా..? అది ఎంత ప్రమాదమో తెలుసా..?
గ్యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే వ్యాధి. ఆధునిక కాలంలో మారిన జీవనశైలి, వేళకు ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి, రాత్రి సరిగా నిద్రపట్టకపోవడం, నిరంతర ఆలోచనలు, కారణం లేకుండానే కోపం రావటం, సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ సమస్య తీవ్రరూపం దాల్చి వేధిస్తోంది. అయితే ప్రతిరోజూ భోజనం చేస్తాం. లేదంట నీరసం వస్తుంది. తినకుంటే పనులు చేయలేం. భోజనం చేసేప్పుడు కొన్ని నియమాలు పాటిస్తాం. అలాగే.. తిన్నాక కూడా కొన్ని నియమాలు పాటించాలి.
లేకపోతే గ్యాస్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. జీర్ణసమస్యలు వస్తాయి. వాటిని గుర్తుపెట్టుకోవాలి. లేదంటే.. గ్యాస్ సమస్యతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏదో అయిపోతుందనే ఆందోళన కూడా వస్తుంది. చాలా మంది భోజనం చేశాక.. హమ్మయ్యా.. ఓ కునుకు తిద్దామని నిద్రపోతారు. కొంతమంది కాళ్లను చాపి కూర్చొంటారు. ఇలా చేస్తే.. తిన్న ఆహారం జీర్ణం కాక గ్యాస్, ఎసిడిటి లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే తిన్న తర్వాత కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. భోజనం అయిపోయాక కొన్ని పనులు చేయోద్దు.
తిన్న తర్వాత ఒక్క సిగరేట్ తాగితే.. హాయిగా ఉంటుందని కొంతమంది అనుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. తిన్న వెంటనే ధూమపానం చేయోద్దు. అలా చేస్తే.. పదిరెట్లు హాని కలుగుతుంది. ధూమపానంతో కలుషితమైన ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. మనం తిన్న ఆహారం మీద ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా కోలన్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది భోజనం చేసిన వెంటనే.. నిద్రపోతారు. అలా చేయకూడదు. నిద్ర వస్తుంది కదా అని పడుకుంటే.. అనేక సమస్యలు వస్తాయి. ఇలా నిద్రపోతే.. తిన్న ఆహారం సరిగా జీర్ణం అవదు. ఈ కారణంగా ఎసిడిటి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.
తిన్న తర్వాత స్నానం కూడా చేయోద్దు. కనీసం గంట ఆగి చేయండి. భోజనం చేశాక తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు ఎక్కువ శక్తి కావాలి. స్నానం చేస్తే.. శక్తి అంతా శరీరం చల్లబడేందుకే అవసరమవుతుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే.. స్నానం చేయోద్దు. కొంతమంది భోజనం చేసిన వెంటనే టీ తాగుతారు. ఇది కూడా ప్రమాదకరం. టీ తాగితే.. మనం తినే ఆహారంలో ఉండే ఐరన్ ను శరీరం గ్రహించలేకపోతుంది. భోజనం చేసిన తర్వాత టీని తాగితే.. శరీరంలో ఐరన్ లోపం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
రక్తహీనత, అలసట, నీరసం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే భోజనం చేశాక టీ తాగొద్దు. భోజనం చేసిన తరువాత చల్లని నీరు తాగకూడదు. మన జీర్ణాశయంలో ఉండే జీర్ణ రసాలు చల్లబడతాయి. ఈ కారణంగా తిన్న ఆహారం ఆలస్యంగా జీర్ణమవుతుంది. ఆహారం ఆలస్యంగా జీర్ణమయితే.. గ్యాస్, అజీర్తి, ఎసిటిడీ, మలబద్ధకం సమస్యలు వస్తాయి.