తరచుగా గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తున్నాయా..? వాటికీ శాశ్వత పరిష్కారం ఇదే.
నేడు చాలా మంది గ్యాస్, అసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని తగ్గించుకోవడానికి ఏవేవో మందులను వాడుతుంటారు. ఈ మాత్రలు తీసుకోవడం వలన సమస్యలు తగ్గినా.. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కొందరు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంటి చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది.
పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తింటేనే సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ ఆహారాలో సులభంగా పొట్ట సమస్యలకు చెక్, రాజ్మాను తినొద్దు. రాజ్మాలో ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ఉబ్బరం సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఒలిగోశాకరైడ్ అనే మూలకాలు కూడా లభిస్తాయి.
కాబట్టి దీని కారణంగా జీర్ణ క్రియ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి రాజ్మాతో తయారు చేసిన ఆహారాలు అతిగా తినడం మానుకోవాల్సి ఉంటుంది. కార్బోనేటేడ్ డ్రింక్స్. కార్బన్ డయాక్సైడ్ అధిక పరిమాణంలో ఉండే పానీయాలను అసలు తాగొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇవి కడుపు లోపల ఒత్తిడిని కలిగించి తీవ్ర వాయువులకు దారి తీస్తుంది. దీంతో ఉబ్బరంతో పాటు తీవ్ర జీర్ణ వ్యవస్థ సమస్యలకు దారీ తీసే ఛాన్స్ ఉంది.
బ్రోకలీ, క్యాబేజీ..కడుపులో గ్యాస్ సమస్యలతో బాధపడేవారు బ్రోకలీ, క్యాబేజీ కలిగిన ఆహారాలను ఎలాంటి పరిస్థితుల్లో తినొద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో చక్కెర పరిమాణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి తీవ్ర ఉబ్బరం సమస్యలకు దారీ తీయోచ్చు. ఉల్లిపాయ వల్ల కూడా పొట్ట సమస్యలు రావొచ్చు..కూరగాయల రుచిని పెంచడానికి ఉల్లిపాయలు కీలక పాత్ర పోషిస్తాయి.
అయితే పొట్ట సమస్యలతో బాధపడేవారు ఉల్లిపాయను అతిగా తినడం వల్ల గ్యాస్ లేదా ఉబ్బరం సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉంది. సలాడ్లు..పచ్చి కూరగాయలు లేదా సలాడ్లను అతిగా తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలిగిన పొట్ట సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సలాడ్లలో అధిక పరిమాణంలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి గ్యాస్ సమస్యలకు దారి తీస్తుంది.