ఈ గింజలు కూరల్లో వేసుకొని తింటే మీ ఎముకలు ఉక్కులా మారుతాయి.
గసగసాలు.. ఒకప్పుడు మాంసాహారం వండాలంటే కచ్చితంగా ఇవి ఉండాల్సిందే. కానీ ఇప్పుడు వీటి వాడకం చాలా తగ్గిపోయింది. ఎవరో తప్ప వీటిని ఇంట్లో నిత్య ఆహారంగా వాడుతున్నవారు చాలా తగ్గిపోయారు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ వీటి వాడకం తగ్గడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేజార్చుకుంటున్నారు. ఈ విత్తనాల నుంచి తీసే నూనె కూడా చాలా ప్రయోజనకరం.
వీటిలో శరీరానికి అవసరం అయ్యే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎముకలు దృఢంగా ఉండాలి. ఇవి శరీరంలోని అతి ముఖ్యమైన భాగాలలో ఒకటి. బలమైన ఎముకలు శరీరాన్ని బలంగా చేస్తాయి. దీనివల్ల రోజువారీ కార్యకలాపాలు సులభంగా చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే బలమైన ఎముకలే మన శరీర నిర్మాణానికి ఆధారం.
ఇవి బలహీనంగా ఉంటే సులభంగా విరిగిపోతాయి లేదా నొప్పిని కలిగిస్తాయి. అందుకే ఎముకల బలం కోసం డైట్‌లో కచ్చితంగా కొన్ని ఆహారాలు ఉండే విధంగా చూసుకోవాలి. చాలా సార్లు చెడు అలవాట్ల కారణంగా ఎముకలు బలహీనపడుతాయి. ఇవి దృఢంగా ఉండాలంటే కాల్షియం అవసరం. ఇది అనేక ఆహారాలలో లభిస్తుంది. అయితే ఈరోజు ఒక ప్రత్యేక విత్తనం గురించి తెలుసుకుందాం.
వీటిని గసగసాలు అని పిలుస్తారు. ఇందులో కాల్షియం, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, జింక్, కాపర్, సెలీనియం, విటమిన్ ఇ వంటి అనేక పోషకాలు ఉంటాయి. వీటిని సరైన మోతాదులో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. గసగసాల గింజలు జీర్ణక్రియ ప్రక్రియకు ముఖ్యమైన ఫైబర్ కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది.
గసగసాలలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. గసగసాలలో థియోనిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది నిద్రపోవడానికి సహాయపడుతుంది. గసగసాలలో గుండెకు మేలు చేసే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. గసగసాలలో ఫైటోకెమికల్ అనే ప్రత్యేక మూలకం ఉంటుంది. ఇది క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడుతుంది.