News

Gas Petrol Prices: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్, భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.

Gas Petrol Prices: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్, భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.

Gas Petrol Prices:ప్రభుత్వ రంగ చమురు రిటైల్ సంస్థలు దేశంలో ఉన్న 90 శాతం పెట్రోల్ పంపులను నిర్వహిస్తున్నాయి. వాటి గణాంకాలు పరిశీలిస్తే పెట్రోల్ సేల్స్ 3.6 శాతం మేర పెరిగాయి. ఇక డీజిల్ సేల్స్ మాత్రం 1.3 శాతం మేర పడిపోయాయి. ప్రభుత్వ కంపెనీలకు సంబంధించి ఏటీఎఫ్ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన 4.3 శాతం మేర పెరిగాయి. అయితే అంతకంతకూ పెరుగుతున్న ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలకు భారంగా మారుతున్నాయి. అయితే ఈసారి సెప్టెంబర్ నుంచి అటు గ్యాస్ సిలెండర్, ఇటు పెట్రోల్-డీజిల్ ధరల్లో భారీగా తగ్గింపు ఉంటుందని తెలుస్తోంది.

Also Read: మహిళల పీరియడ్ నొప్పిని సింపుల్ గా తగ్గించే చిట్కాలు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు సూచన అందింది. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గవచ్చని తెలుస్తోంది. పెట్రోల్‌పై 6 రూపాయలు, డీజిల్‌పై 5 రూపాయలు తగ్గవచ్చు. ఈసారి అంటే రేపు జరిగే ఆయిల్ కంపెనీల సమీక్షలో ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరలు తగ్గించేందుకు ఆలోచన చేస్తున్నారు. ఉజ్వల పధకంలో భాగంగా పూర్తి ధరతో సిలెండర్ కొనుగోలు చేసిన తరువాత 300 రూపాయలు నేరుగా లబ్దిదారుడి ఖాతాలో పడుతుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో భాగంగా ఎల్పీజీ గ్యాస్ సిలెండర్‌పై ఇప్పటికే 300 రూపాయలు సబ్సిడీ అందుతోంది.

ఈసారి అంటే సెప్టెంబర్ 1వ తేదీన శుభవార్త అందించనుంది కేంద్ర ప్రభుత్వం. ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరల్ని 50 రూపాయ వరకు తగ్గించవచ్చని తెలుస్తోంది. కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరల్ని 60-70 రూపాయలు తగ్గించవచ్చు. ఎల్పీజీ గ్యాస్ ధరల్ని ప్రతి నెలా ప్రభుత్వం సమీక్షించి తగ్గించం లేదా పెంచడం చేస్తుంటుంది. ఈ సమీక్షలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆయిస్ కంపెనీలు పాల్గొంటాయి కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ ధరల్ని తగ్గించే ఆలోచన చేస్తోంది.

Also Read: చనిపోయేముందు మనిషి మెదడులో ఏం జరుగుతుందో మీరే తెలుసుకోండి.

డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరల్ని తగ్గించనుంది. దీంతోపాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గవచ్చు. ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధర నేరుగా సామాన్య, మధ్య తరగతి ప్రజల ఖర్చుల్ని ప్రభావితం చేస్తుంటుంది. ప్రతి నెలా జరిగే సమీక్షలో ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఈసారి ధరలు తగ్గించవచ్చని సమాచారం. ప్రజల ప్రయోజనార్ధం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ధరలు తగ్గించేందుకు కొత్త ప్రణాళిక రూపొందిస్తోంది. పెట్రోల్-డీజీల్, గ్యాస్ ధరలు తగ్గించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker