ఈ మిశ్రమాన్ని తరచూ తింటుంటే ఆస్పత్రికి వెళ్ళాల్సిన అవసరం రాదు.
వెల్లుల్లి అందరికీ తెలిసిన పదార్థమే కాదు.. ఇది ఆహారాలకు అద్భుతమైన టేస్ట్ ని ఇస్తుంది. అనేక అనారోగ్య సమస్యలకు న్యాచురల్ రెమిడీగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే యాక్టివ్ ఇంగ్రిడియంట్ ఉంటుంది. ఒకవేళ వెల్లుల్లిని వేడి చేయడం, ఉడికించి తీసుకోవడం వల్ల.. ఈ అల్లిసిన్ అనే పదార్థం తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడూ.. వెల్లుల్లిని పచ్చిగా తీసుకోవాలి. అయితే ఆయుర్వేదంలో ఎన్నో చిట్కాలు ఉన్నాయి. ఎంత పెద్ద వ్యాధినైనా నయం చేసే పద్ధతులు కనిపిస్తాయి. కానీ మనం పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
ఓ ఇరవై వెల్లుల్లి రెబ్బలను తీసుకుని ఒక గిన్నెలో వేసి అవి మునిగేంత వరకు తేనె పోయాలి. తరువాత కలుపుకుని వాటిని ఓ గాజు సీసాలో భద్రపరచుకోవాలి. వారం రోజుల తరువాత వెల్లుల్లి రెబ్బలను తీసుకుని రోజుకు రెండు చొప్పున ఉదయాన్నే పరగడుపున కడుపులోకి తీసుకోవాలి. దీంతో ఎన్నో రోగాల నుంచి ఉపశమనం పొందొచ్చు. జీర్ణ సంబంధమైన సమస్యలను దూరం చేస్తాయి. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. చర్మసంబంధ సమస్యలు కూడా పోతాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయి.
ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉన్న అధిక కొవ్వును కరిగిస్తుంది. కొవ్వు పేరుకుపోతే గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందొచ్చు. వెల్లుల్లిలో అన్ని మంచి గుణాలు ఉన్నందున మన పూర్వీకులు వంటల్లో విరివిగా వాడేవారు. రక్తపోటును నియంత్రిస్తాయి. షుగర్ వ్యాధికి కూడా మంచి మందులా ఇవి ఉపయోగపడతాయి. ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీరంలో ఉండే నొప్పులను తగ్గిస్తాయి.
ప్రతి రోజు వెల్లుల్లి తీసుకోవడం వల్ల శరీరంలో ముడతలు రాకుండా ముసలి తనం ఏర్పడకుండా నిరోధిస్తుంది. వీటిని అన్ని వయసుల వారు తీసుకోవచ్చు. ఎలాంటి ఇతర సమస్యలు రావు. వైద్యుల చుట్టు తిరగకుండా చేస్తుంది. మనకు వచ్చే రోగాలను రాకుండా చేస్తుంది. అందుకే వెల్లుల్లిని ఆహారంలో కూడా చేర్చుకుని తింటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఇన్ని రకాల లాభాలు కలిగించే వెల్లుల్లి రెబ్బలను క్రమం తప్పకుండా తీసుకుని మంచి ఫలితాలు పొందేందుకు ప్రయత్నిస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.