లక్షలు పెట్టినా తగ్గని రోగాలు మన చుట్టూ పరిసరాల్లో ఉండే ఈ చెట్టుతో తగ్గుతాయి.
ఇది మనకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. రోడ్ల పక్కన కూడా కానుగ చెట్లు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి ద్వారా మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కానుగ చెట్టుకు చెందిన పలు భాగాలను ఉపయోగించి మనకు కలిగే పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. అయితే ఈ భూమి మీద పుట్టిన మొక్కలలో ఏదో ఒక ఔషధ గుణం దాగి ఉండటం సహజమే.
ప్రతి మొక్క మనిషికి ఏదో రకంగా ఉపయోగపడుతుంది. కాకపోతే దాని విలువ మనం గుర్తించడం లేదు. అందుకే మనం రోగాల బారిన పడుతున్నాం. వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటే మనకు రోగాలు లేని సమాజం సాధ్యమే. కానీ అందరు ఇంగ్లిష్ మందులకు అలవాటుపడి చెట్ల మందులను నిర్లక్ష్యం చేస్తున్నారు.
దీంతో మనకు జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది. మనకు రోడ్లు పక్కన కనిపించే చెట్టు కానుగ. ఇందులో కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది రోడ్ల వెంట పెరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మీటర్లు పెరుగుతుంది. పువ్వులు పూస్తుంది. కాయలు కాస్తుంది. దీన్ని మొండి చెట్టు అని కూడా పిలుస్తుంటారు. దీని ఆకులు ప్రత్యేకమైన వాసనను కలిగి ఉంటాయి. దీని విత్తనాలు జీవన ఇంధనంగా వాడతారు.
దీని విత్తనాల నుంచి తీసే నూనెను సబ్బుల తయారీలో వాడతారు. జ్వరం, దగ్గు, చర్మవ్యాధులు, పుండ్లు, గాయాలు, పైల్స్ , మానసిక వ్యాధులకు ఇది ఉపయోగపడుతుంది. కడుపులో ఉండే వాతం, శ్లేష్మాలు తగ్గిస్తుంది. నులిపురుగుల నివారణకు కూడా సాయపడుతుంది. ఇలా కానుగను ఉపయోగించుకుని మనం పలు రోగాలను దూరం చేసుకోవచ్చు. ఇలా కానుగ చెట్టు కూడా మనకు దోహదపడుతుంది.
దీని నుంచి పెట్రోల్ తీస్తారని కూడా అప్పట్లో చెప్పారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి కనిపించడం లేదు. ఇన్ని రకాల లాభాలు ఇచ్చే కానుగ చెట్టును కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో వాటిని కొట్టేయకుండా కాపాడుకుని మన రోగాలను దూరం చేసుకునేందుకు ఉపయోగించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.