గణేషుడికి ఇష్టమైన రాశులు ఇవే, ఈ రోజు రోజు నుంచి ఈ రాశులవారికి ఆష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు మీ సొంతం.
ఆశీర్వాదం పొందవలసినదే. సహజంగానే గణపతి ధోరణి నిదానమే ప్రధానమన్నట్టుగా కనిపిస్తూ వుంటుంది. ఎప్పుడు చూసినా ప్రశాంతతకు ప్రతిరూపంగా కనిపించడం వల్లనే అంతా ఆయన చుట్టూ చేరుతుంటారు. అందుకే మనం చేసే కార్యాల్లో విజ్ఞలు తొలగిపోవాలని విఙ్ఞవినాయకుడిని ప్రార్దిస్తుంటాము. అయితే భక్తుల విఘ్నాలను తొలిగించే విఘ్నేశ్వుడిగా పార్వతి పుత్రుడైన వినాయకుడిని పూజిస్తారు.
భక్తుల సమస్యలను తీర్చి వారికి విజయాన్ని, సంపదలను ప్రసాదించే దేవుడిగా కూడా గౌరీ తనయుడు ప్రసిద్ధి. అందుకే గణపతిని ప్రతి కార్యంలోనూ ఆదిదేవుడిగా పూజిస్తారు. ఇక ప్రతి ఏటా మాదిరిగానే జరుపుకునే వినాయక చతుర్థి ఈ ఏడాది సెప్టెంబర్ 18న వచ్చింది. దీంతో విఘ్న వినాయకుడిని పూజించేందుకు భక్తులంతా సిద్ధమయ్యారు. భక్తుల కోరికలు తీర్చే వినాయకుడికి రాశిచక్రంలోని కొన్ని రాశులంటే ఎంతో ఇష్టం. ఫలితంగా ఆయా రాశులవారికి సిరిసంపదలు, అష్టైశ్వరాలు ప్రాప్తిస్తాయి.
మేష రాశి.. మేష రాశి గౌరీ తనయుడికి ఎంతో ఇష్టమైన రాశి. కుజుడు పాలించే ఈ రాశి వారిపై గణేషుడి అనుగ్రహం అన్ని వేళలా ఉంటుంది. ఫలితంగా వీరు అన్నీ పనులను సవ్యంగా పూర్తి చేయగలుగుతారు. నలుగురిలో మంచి పేరు, ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. కన్యా రాశి.. వినాయకుడి విశేష అనుగ్రహం ఉండే రాశుల్లో కన్యా రాశి కూడా ఒకటి.
బుధుడు అధిపతి అయిన కన్యా రాశి వారిపై వినాయకుడి అనుగ్రహం ఉన్న కారణంగా వీరు అన్ని వేళలా తెలివి తేటలతో జీవిస్తారు. తలపెట్టిన పనుల్లో ఎలాంటి ఆటంకాలను అయినా అధిగమించి, విజయాలను సొంతం చేసుకోగలుగుతారు. మకర రాశి.. గణేషుడికి ఇష్టమైన మరో రాశి మకర రాశి. గణేషుడి ఆదరణ మకర రాశి వారికి అన్ని వేళలా లభిస్తుంది.
ఫలితంగా వీరికి కష్టానికి తగిన ఫలితం, మానసిక స్థైర్యం, క్లిష్ట పరిస్థితులను అధిగమించగల నేర్పు వంటి గొప్ప లక్షణాలు ఉంటాయి. మిధున రాశి.. గణేశుడి అనుగ్రహం మిథున రాశి వారి పట్ల ఎప్పుడూ ఉంటుంది. బుధుడు అధిపతి అయిన మిథున రాశి వారు ఎల్లప్పుడూ మానసికంగా పదునుగా ఉంటారు. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. జీవితంలో అభివృద్ధి పొందుతారు.