కీళ్ల నొప్పులకు శాశ్వత పరిష్కారం ఈ గుగ్గుల, ఎలా వాడలో తెలుసుకోండి.
గుగ్గులు.. తిప్పతీగను, త్రిఫలాలను సమాన భాగాలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచి నీళ్లకు కలిపి మరిగించి కషాయం తయారుచేసుకోవాలి. అర కప్పు కషాయానికి అర టీ స్పూన్ శుద్ధ గుగ్గులు కలిపి నెల రోజులపాటు తీసుకుంటే దీర్ఘకాలంనుంచీ బాధించే మెడనొప్పి తగ్గుతుంది. కీళ్ల నొప్పులకు వైద్యచికిత్సల్లో ఆయుర్వేద నిపుణులు యోగరాజ గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు, లాక్షాది గుగ్గులు, మహావాత విధ్వంసినీ రసం వంటి మందులు ఇస్తారు. అయితే గుగ్గుల అనేది చెట్టు నుంచి కారే జిగురు పదార్థం లాంటిది.. ఉదాహరణకు తుమ్మ జిగురు లాగా.. గుగ్గుల అనేది.. గుగ్గుల చెట్టు నుంచి కారె ఒక జిగురు పదార్థం.. గుగ్గుల అనేది ఆయుర్వేదిక వైద్యంలో అనేక మూలిక ఔషధాలు తయారీలో విరివిగా ఉపయోగిస్తారు గుగ్గులకు ఆయుర్వేదంలో విశిష్ట స్థానం ఉంది.. దీనికంటూ ఓ ప్రత్యేకత కూడా ఉంది.
గుగ్గులను ఉపయోగించడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.!? గుగ్గుల ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. గుగ్గుల పెయిన్ కిల్లర్.. గుగ్గుల అనేది ఒక ఔషధ మూలిక.. శుద్ధి చేసిన గుగ్గుల పలు అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. గుగ్గుల అర గ్రాము మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి తీసుకోకూడదు. ఇది శరీరంలో వేడిని పుట్టిస్తుంది ఇలా వేడి పుట్టడం ద్వారా కీళ్ల నొప్పులు కండరాల నొప్పులను తగ్గిస్తుంది.. ఇది శరీరభవరులు తగ్గించడానికి సహాయపడుతుంది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాలను కరిగిస్తుంది.
రక్తనాళాలలో ఉన్న కొలెస్ట్రాలను కరిగించడానికి గుగ్గుల అద్భుతంగా సహాయపడుతుంది. ఇది సహజ సిద్ధమైన పెయిన్ కిల్లర్. ఆయుర్వేదంలో కీళ్ల నొప్పులకు సరైన పరిష్కారం గుగ్గుల.. ఆధునిక పరిశోధనలలో కూడా గుగ్గుల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులను తగ్గించడంతో పాటు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని పరిశోధనలు తేల్చి చెప్పాయి. అంతేకాకుండా ఇవి అన్ని రకాల శారీరక నొప్పులను కూడా తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గడానికి గుగ్గుల ను అరగ్రాము లేదా శరీర బరువులు బట్టి ఒక గ్రామం గుగ్గులను తీసుకొని అందుకో నేతిని కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఈ మిశ్రమం తీసుకున్న వెంటనే పాలు తాగాలి. ఇలా తరచూ తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, శారీరక నొప్పులు తగ్గుతాయి.
ఒక గ్రాము గుగ్గులలో తగినంత గోరువెచ్చటి నూనెను రాసుకొని కీళ్లపై మర్దన చేసుకుంటే నొప్పుల నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. చక్కటి పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. శారీరకనప్పుడు ఎక్కడ ఉన్నా కూడా ఈ మిశ్రమాన్ని రాసుకుంటే వెంటనే రిలీఫ్ లభిస్తుంది. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు అర గ్రాము గుగ్గులను తీసుకొని వేడి నీటిలో కలిపి దీనిని ఉదయం సాయంత్రం తీసుకోవడం వల్ల త్వరగా శరీరంలోని కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు గుగ్గుల 500 mg , దీనికి ఒక చెంచా త్రిఫల చూర్ణాన్ని కలిపి తీసుకుంటే బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. గుగ్గులలో ఫ్లేవనాయిడ్స్, కార్బోహైడ్రేట్స్, అమైయినో ఆమ్లాలు ఉన్నాయి. ఇంకా యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంది. దీనిని పురాతన కాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు.
గుగ్గుల చర్మ సంబంధ సమస్యలను నయం చేస్తుంది మొటిమలు, తామర, సోరియాసిస్ నయం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. చర్మం పై మంట, దురద ను కూడా తగ్గిస్తుంది. గుగ్గుల రొమ్ము క్యాన్సర్ రేడియో జరిపి చికిత్స కారణంగా వచ్చిన చర్మ సమస్యలను కూడా నయం చేస్తుందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి గుగ్గుల సహాయపడుతుంది.గుగ్గుల ను మితంగా తీసుకోవాలి. మోతాదుకు మించకుండా తీసుకుంటే ఫలితం. లేదంటే అనర్ధమే. ఏది శరీరానికి వేడి పుట్టించే పదార్థం. దీనిని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల చర్మం పై దద్దుర్లు, అతిసారం, తేలికపాటి వికారం, ఎక్కీల్లు, రుతు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.