Health

పండ్లపై ఉప్పు చల్లుకుని తింటున్నారా..? మీ కిడ్నీలు తొందలోనే..?

సాధరణంగా ఉప్పు ఎక్కువగా ఆరోగ్యానికి మంచిది కాదంటారు. కానీ ఆయుర్వేదం ఉప్పు వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతుంది. ఉప్పులో ఉండే మినరల్స్ మనల్ని అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. ఉప్పు జీర్ణ రసాల ఉత్పత్తిలో సహాయపడుతాయి. దీంతో జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. అయితే పండ్లు అన్ని కాలాల్లోను శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ప్రస్తుతం చాలా మంది పండ్లను కోసి ఉప్పు, మసాలాలు వేసి తినడానికి ఇష్టపడతారు. ఇలా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

ఉప్పు, చాట్ మసాలాలో ఉండే సోడియం తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇలా ప్రతి రోజు పండ్లను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దీని వల్ల శరీరంలో పోషకాలు కూడా తగ్గుతాయి. పండ్లపై ఉప్పు, చాట్ మసాలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. శరీరంలో పోషకాలు పరిమాణాలు తగ్గుతాయి.

పండ్లలో ఉప్పు, మసాలాలు వేసుకుని తీసుకోవడం వల్ల నోటికి రుచిని అందించిన తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పండ్లలో ఖనిజాలు కూడా తగ్గుతాయి. దీని కారణంగా శరీరంలో పోషకాల కోరత తగ్గుతుంది. శరీర బరువును పెంచుతుంది. పండ్లలో సహజంగా గ్లూకోజ్ పరిమాణాలు అధికంగా లభిస్తాయి.

వీటిని ప్రతి రోజు తినడం వల్ల శరీరంలో కేలరీలు పెరుగుతాయి. వేసవి కాలంలో చాలా మంది మామిడి పండ్లలో పంచదార వేసుకుని తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీర బరువు కూడా పెరుగుతారు. మూత్రపిండాలపై ప్రభావం.. పండ్లపై ఉప్పు లేదా చక్కెర వేసుకుని తినడం వల్ల మూత్రపిండాలపై ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

అంతేకాకుండా దీని వల్ల మూత్రంలో సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చర్మంపై వాపు.. పండ్లపై ఉప్పు చల్లుకుని తింటే చర్మంపై వాపు ఇతర సమస్యలు వస్తాయి. ఉప్పులో ఉండే సోడియం కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గే అవకాశాలున్నాయి. కాబట్టి పండ్లపై ఉప్పు, చక్కెర చల్లుకుని తినడం తీసుకోవాల్సి ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker