ప్రజలకు గుడ్ న్యూస్, ఇలా చేస్తే మీ ఇంటికి ఉచితంగా కరెంటు వస్తుంది.
సౌర విద్యుత్తుపై కేంద్ర సర్కారు కొత్త పథకం పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన(PM Surya Ghar Muft Bijli Yojana) పథకానికి ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఆమోదం దక్కింది.దీంతో పాటుగా భారతదేశంలో ప్రధాన కార్యాలయంతో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ప్రజలపై కరెంటు బిల్లుల భారం పడకుండా సౌర విద్యుత్తు వాడకాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా తాజా పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంలో సౌర విద్యుత్తు ఫలకలు బిగించుకునేవారికి భారీగా రాయితీలు ప్రకటించింది.
దానితోపాటు బ్యాంకు రుణాలు కూడా అందిస్తోంది. ఈ పథకం 1 kW విద్యుత్తును ఉత్పత్తి చేసే సోలార్ సిస్టమ్‌కు రూ.30,000 సబ్సిడీ, 2 kW సిస్టమ్‌కు రూ.60,000, 3 kW లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన సోలార్ వ్యవస్థకు రూ.78,000 సబ్సిడీని అందిస్తోంది. జాతీయ పోర్టల్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి సంబంధిత రంగంలో నిపుణుడైన ఎవరినైనా సంప్రదించొచ్చు. గృహాల్లో ఇన్‌స్టాలేషన్ కోసం 7 శాతం వడ్డీ రహిత రుణాలు పొందవచ్చు.
పథకం ప్రాధాన్యత వివరించడానికి ప్రతి జిల్లాలో మోడల్ సోలార్ విలేజ్‌ను అభివృద్ధి చేస్తారు. ప్రజల బ్యాంకు ఖాతాలకు నేరుగా అందజేసే సబ్సన్టీవ్ రాయితీల నుండి భారీ రాయితీతో కూడిన బ్యాంకు రుణాల వరకు కేంద్రం ప్రజలపై ఎలాంటి వ్యయ భారం లేకుండా చూస్తుందని ప్రధాని మోదీ గతంలో చెప్పారు. పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీల ప్రజాప్రతినిధులు, అధికారులు పథక ప్రాముఖ్యతను తెలిపేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని మోదీ కోరారు.
2030 నాటికి సూర్యుడి ద్వారా 500 గిగా వాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా ఇంధన వ్యయం తగ్గించడంతోపాటు ప్రజలపై విద్యుత్ భారం తగ్గుతుందని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (CEEW) సీనియర్ ప్రోగ్రామ్ లీడ్ నీరజ్ కుల్దీప్ చెప్పారు. ఉచిత విద్యుత్ పథకం రాయితీ పథకానికి దరఖాస్తు చేసుకోండిలా.. బిజిలీ పథకం లింక్ క్లిక్ చేయండి. రూఫ్‌టాప్ సోలార్ కోసం అప్లై అనే బటన్ నొక్కండి. రాష్ట్రం, విద్యుత్ పంపిణీ సంస్థ, కుటుంబ సభ్యుల సంఖ్య, మొబైల్ నంబర్, ఈ – మెయిల్ వివరాలు ఎంటర్ చేయాలి. తరువాతి దశకు వెళ్లడానికి మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయండి.
అలా చేసిన తరువాత పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ ఏ దశలోనైనా బ్యాంక్ వివరాలను సమర్పించొచ్చు. ప్యానళ్లు ఇన్‌స్టాల్ చేసే వ్యక్తిని సంప్రదించాలి. ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, ప్లాంట్ వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోండి. నెట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేశాక డిస్కం తనిఖీ చేసిన తర్వాత పోర్టల్ నుంచి కమీషనింగ్ సర్టిఫికేట్ రూపొందుతుంది. కమీషనింగ్ నివేదిక పొందిన తర్వాత పోర్టల్ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు, రద్దయిన చెక్కును సమర్పించండి. ఇలా చేసిన 30 రోజుల్లోగా బ్యాంక్ ఖాతాలో సబ్సిడీని అందుకుంటారు.