ఫుడ్ పాయిజనింగ్ జరిగిన వెంటనే ఏం చెయ్యాలో తెలుసుకోండి.
ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువగా కలుషితమైన లేదా ఉడకని ఆహారం వల్ల వస్తుంది. జెర్మ్స్ లేదా వైరస్లు నీటి సీసాల మెడ వంటి కలుషితమైన ఉపరితలాల ద్వారా కూడా బదిలీ కావచ్చు. చాలా సూక్ష్మక్రిములు మరియు బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి, ఇది చాలా తక్కువగా తెలిసిన వాస్తవం. అయితే ఫుడ్ పాయిజనింగ్ అనేది కలుషిత ఆహారం తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్య. చాలా సందర్భాల్లో ఫుడ్ పాయిజనింగ్ అనేది అంత తీవ్రమైనదేం కాదు, ఇది ఒక తేలికపాటి సమస్య. సాధారణంగా చికిత్స లేకుండానే పరిష్కారం అవుతుంది.
వ్యక్తులను బట్టి ఇది 24 గంటలు నుంచి ఒక వారం వరకు పట్టవచ్చు. ఫుడ్ పాయిజనింగ్ జరిగినపుడు అత్యంత సాధారణ లక్షణాలు వికారం, వాంతులు, విరేచనాలు ఉంటాయి. ఫుడ్ పాయిజనింగ్‌కు కారణం తరచుగా గుర్తించలేము. పౌల్ట్రీ లేదా మాంసాన్ని సరిగ్గా వండకపోవడం వల్ల కూడా ఇది సంభవించవచ్చు, దీని ద్వారా సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఫుడ్ పాయిజనింగ్‌కు కలుషిత నీరు కూడా ఒక కారణం కావచ్చు. ఫుడ్ పాయిజనింగ్ జరిగినపుడు కడుపులో తిప్పినట్లుగా అవడం, వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు.
అయితే కొన్ని ఇంటి నివారణలతోనే ఫుడ్ పాయిజనింగ్‌కు చికిత్స చేయవచ్చు. ఓఆర్ఎస్.. వాంతులు, అతిసారం ఉన్నప్పుడు శరీరాన్ని రీహైడ్రేట్ చాలా ముఖ్యం. ఇందుకోసం నీటితో పాటు కొన్ని లవణాలను కలిపి తాగాలి. డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం స్వచ్ఛమైన తాగునీటిలో కొంచెం చక్కెర, ఉప్పు కలిపడం ద్వారా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్‌ఎస్) ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తయారుచేసిన ఈ ఎలక్ట్రోలైట్-రిచ్ సొల్యూషన్‌ను ప్రతి కొన్ని నిమిషాలకు సిప్ చేయాలి, ఈ ద్రావణాన్ని ఒక రోజులోపే వాడాలి.
లేదా కొబ్బరి నీళ్లలో చిటికెడు దాల్చిన చెక్కను కలిపి సేవించడం వల్ల కూడా వాంతులు తగ్గుతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ పళ్ల రసం నుంచి తయారు చేసే ఆపిల్ సైడర్ వెనిగర్ ద్రావణం ఆల్కలీన్ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌ను సమర్థవంతంగా నయం చేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లోని ఆల్కలీన్ ప్రభావం మన కడుపులోని ఆమ్లతను తగ్గిస్తుంది, ఫుడ్ పాయిజనింగ్ లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. అల్లం.. ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలను తగ్గించడంలో అల్లం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనిలోని సహజ శోథ నిరోధక గుణాల కారణంగా, ఇది కడుపు లైనింగ్‌కు ఉపశమనం కలిగిస్తుంది.
ఒక కప్పు నీటిలో ఒక చెంచా తురిమిన అల్లం వేసి మరిగించాలి, గోరు వెచ్చగా ఉన్నప్పుడు కొంచె తేనె కలుపుకొని తాగాలి. తేనె.. తేనే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఫుడ్ పాయిజనింగ్ నివారణలలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ తేనెను రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. లేదా నిమ్మరసంతో కూడా తీసుకోవచ్చు. నిమ్మకాయ.. ఫుడ్ పాయిజనింగ్‌కు సంబంధించినంత వరకు నిమ్మకాయను ‘చికిత్సల రాజు’ గా పరిగణిస్తారు. నిమ్మకాయలోని బలమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతాయి. ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని తేనెతో కలిపి నేరుగా తినాలి.