మీకు వచ్చింది, జ్వరమా..? లేక కోవిడా..? అని ఇంట్లోనే సింపుల్ గా తెలుసుకోవచ్చు.
వైరస్ పుట్టిన దేశంలోనే మహమ్మారి మరోసారి భయాందోళనలు పుట్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్ని గడగడలాడించిన వైరస్ ఇప్పడు అంతకు మించిన రెట్టింపు వేగంతో విస్తరిస్తోంది. వైరస్ మహమ్మారి విడిచిపెట్టిందని కరోనా ఆంక్షలు సడలించడం, లాక్‌డౌన్లు ఎత్తివేయడంతో వైరస్ వ్యాప్తి విస్తృతంగా పెరిగింది. అయితే జ్వరం, కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ రెండింటి లక్షణాలు కొంచెం ఒకేలా ఉండటంతో జనాలు టెస్టులు కూడా చేయించుకోవడం లేదు. దీనివల్లే చాలా మంది కోవిడ్ తో ఇబ్బంది పడుతున్నారు. కేరళ సహా చాలా రాష్ట్రాల్లో జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.
దీనికి తోడు కొంతకాలం నుంచి మళ్లీ దేశంలో కరోనా కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి. అందుకే చాలా మంది తమకొచ్చింది జ్వరమా? లేకపోతే కోవిడా? అన్నది గుర్తించలేకపోతున్నారు. కోవిడ్ వచ్చినవాళ్లు కూడా సాధారణ జ్వరంలాగే భావించి టెస్టులు చేయించుకోవడం మానేస్తుంటారు. హాస్పటల్లకు కూడా వెళ్లరు. దీనివల్లే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కరోనా లక్షణాలో ఒకటి. ముఖ్యంగా ఈ సమస్య కోవిడ్ సోకిన వ్యక్తుల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది.
సంక్రమణ సమయంలో లేదా తర్వాత కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అయితే ఈ సమస్య కరోనా సోకిన అందరికీ కనిపించకపోవచ్చు. కానీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపిస్తే అది మామూలు జ్వరం కాదని గుర్తించుకోవాలి. ఎందుకంటే జ్వరం వల్ల శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది కలగదు. అందుకే ఇది కోవిడ్ అని నిర్ధారించుకోవాలి. విపరీతమైన అలసట.. చాలా మంది విపరీతమైన అలసటతో బాధపడుతున్నామని చెప్తుంటారు.
అయితే ఇది కూడా జ్వరం సాధారణ లక్షణం కాదు. భరించలేని అలసట కలిగితే మీకు కోవిడ్ సోకినట్టేనంటున్నారు నిపుణులు. ఇలాంటి అలసట ఎక్కువ కాలం ఉంటుంది. పొడి దగ్గు.. జ్వరంతో బాధపడే వారిలో దగ్గు, జలుబు సమస్యలు కూడా కనిపిస్తాయి. కానీ అది కేవలం దగ్గు అయితే అందులోనూ పొడి దగ్గు అయితే అది ఖచ్చితంగా కోవిడ్ వల్లేనని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జ్వరం వల్ల పొడిదగ్గు రాదు. బాడీ టెంపరేచర్ సాధారణ జ్వరానికి కోవిడ్ కు శరీర ఉష్ణోగ్రత భిన్నంగా ఉంటుంది.
సాధారణ జ్వరం అయితే మీ శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. కానీ కోవిడ్ వల్ల అప్పుడప్పుడు కొద్దిగా మాత్రమే బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. వీటి మధ్య తేడాను గుర్తిస్తే అది సాధారణ జ్వరమా? లేక కోవిడా అనేది సులువుగా గుర్తించొచ్చు. అయితే మీలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా అని టెన్షన్ పడకుండా.. మీరే స్వయంగా నిర్దారించుకోకండి. హాస్పటల్ కు వెళ్లి టెస్టులు చేయించుకోవడం మంచిది.