మూర్ఛవ్యాధి వచ్చినప్పుడు తాళాలు ఎందుకు పెడతారో తెలుసా..?
నాడీవ్యవస్థ పైన ప్రభావం చూపించే వ్యాధి మూర్చ వ్యాధి అని ఇది ఏ వయస్సు వారికైనా రావచ్చు. ప్రతి సంవత్సరం సుమారు 1, 80,000 కొత్త మూర్ఛ వ్యాధి కేసులు రాష్ట్రవ్యాప్తంగా నమోదు అవుతున్నాయని తెలుసా. అయితే ఫిట్స్ వచ్చేముందు ఎలాంటి లక్షణాలు కన్పించవు. కాబట్టి మనిషి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మూర్ఛ వచ్చే ప్రమాదం ఉంది. మూర్చ వచ్చిన వెంటనే ఎవరైనా ఇనుప తాళాల కోసం తెగ వెతుకుంటారు.
ఎందుకంటే మూర్ఛను కంట్రోల్‌లో పెట్టే శక్తి ఒక్క ఇనుప వస్తువుకు మాత్రమే ఉందని అందరి అభిప్రాయం. కానీ ఇందులో ఎంతమాత్రం నిజం లేదంటున్నారు న్యూరో సర్జన్ నిపుణులు. ఇంకా నిజం చెప్పాలంటే.. ఎవరికీ మూర్ఛ వచ్చినా అది 2 నుంచి 5 నిమిషాలలోపే ఉంటుందట. ఈలోపు ఖంగారు పడి ఎక్కడో చోట తాళాలు గాని, ఇనుప వస్తువు చేతిలో పెడుతాము. 5 నిమిషాల వ్యవధిలో కాళ్లు, చేతులు ఆడించడం ఆగుతుంది.
దీంతో తాళాలు బాగా పనిచేశాయనుకుంటాం. తాళాలు పెట్టినా పెట్టకున్నా ఫలితం ఒకేలా ఉంటుంది. తాళాలు, ఇనుప రాడ్‌లు మూర్ఛవ్యాధిని ఆపలేదు కాబట్టి, ఆ సమయంలో ఏం చేయాలంటే.. మూర్ఛ వచ్చిన రోగిని నేలపై పడుకోబెట్టాలి. ఫిట్స్‌తో కొట్టుకుంటూ కాళ్లు, చేతులు అటూ ఇటూ వేగంగా కదిలించినా అలానే వదిలేయాలి.
ఆపడానికి ప్రయత్నించకూడదు. ఒకవేళ ఆపినట్లయితే వారికి సడెన్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మూర్ఛ వచ్చిన రోగి నోట్లో నురగ వస్తుంది. దాన్ని ఆపడానికి నోట్లో ఎలాంటి వస్తువులు, దుస్తులను పెట్టకూడదు. వారికి వాంతింగ్ చేసుకుంటుంటే చేయనివ్వాలి. రోగికి తగినంత గాలి తగిలేలా చూడాలి. వైద్యుని దగ్గరకు వెళ్లేంతవరకు ఈ చిన్నపాటి చికిత్స చేస్తే ఆ వ్యక్తి కాపాడుకోవచ్చు.