Health

చేప కళ్లు తింటే ఎంత మంచిదో తెలుసా..? ఈ విషయాలు తెలిస్తే వెంటనే తినేస్తారు.

కొంతమంది చేపల కండకలిగిన భాగాలను మాత్రమే తిని తల తీసేస్తారు. నిజానికి చేపల తల, కళ్లలో చాలా పోషకాలు ఉంటాయి. మీరు చేపల పూర్తి ప్రయోజనాలను పొందాలనుకుంటే పారేయకండి. దాని కళ్లను తప్పకుండా తినండి. అయితే మనలో చాలామంది చేపల్లో కేవలం కండ భాగాన్ని మాత్రమే తింటారు. తలను తినకుండా వదిలేస్తారు. వాస్తవానికి చేపల తలలో అధిక మోతాదులో పోషకాలు ఉంటాయి.

వాటి కళ్ళల్లో కూడా అద్భుతమైన విటమిన్లు ఉంటాయి. చేప కళ్ళను తింటే కంటిచూపు మెరుగుపడుతుంది. కంటి చూపు సమస్య ఉన్నవారు చేపకళ్ళను తింటే తగ్గుతుంది. ఎందుకంటే చేపల కళ్ళల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి నేత్ర సంబంధిత సమస్యలను తొలగిస్తాయి. చూపు మెరుగుపడేందుకు కారణమయ్యే విటమిన్లను క్రమబద్ధీకరిస్తాయి. కళ్ళకు మాత్రమే కాదు గుండె ఆరోగ్యానికి కూడా చేప కళ్ళు చాలా మంచివి.

చేప కళ్ళల్లో ఉన్న పోషకాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. గుండెపోటు వంటి సమస్యలను దూరం చేస్తాయి. మెదడులో రక్త ప్రసరణను క్రమబద్ధీకరించడం వల్ల పక్షవాతం వంటి వాటిని నిరోధిస్తాయి. ఆటిజం వంటి మానసిక సమస్య నుంచి కూడా బయటపడేందుకు చేపల కళ్ళు సహకరిస్తాయి. ఆటిజం ఉన్న వ్యక్తి ఊరికే అలసిపోతారు. ప్రతి చిన్న విషయానికి ఆత్రుతను ప్రదర్శిస్తుంటారు. వీరిలో ఆసక్తి లోపం కూడా ఉంటుంది.

అలాంటివారు చేపల కళ్ళు తింటే అందులో ఉన్న ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఆటిజం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. భావోద్వేగాలను సమతౌల్యం చేస్తుంది. కడుపులో ఉన్న దీర్ఘకాలిక యాసిడ్ మంట తగ్గుతుంది. చేపల కళ్ళల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ప్రశాంతమైన నిద్రకు విటమిన్ డి ఉపకరిస్తుంది.

ఇక ట్యూనా, సాల్మన్ చేపలు ఆరోగ్యానికి మంచివి. పైగా వీటిలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఈ చేపలు క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. నోరు, స్వర పేటిక, పెద్ద పేగు, క్లోమం వంటి అవయవాలకు వచ్చే క్యాన్సర్ ను తగ్గిస్తాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ టెక్నికల్ న్యూట్రిషన్ అధ్యయనంలో తేలింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker