Health

కిడ్నీ వ్యాధులున్నవారు చేపలు తింటే ఏం జరుగుతుందో తెలుసుకోండి.

చేపల్లో వుండే ఒమేగా-3 ఫాటీయాసిడ్స్ శరీర రక్తంలోని ట్రై-గిసరైడ్‌లను తగ్గించటమే కాకుండా, రక్త పీడనాన్ని, రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. ఇంకా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కావున వారానికి రెండు లేదా మూడు సార్లు చేపలను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా మధుమేహం విస్తరిస్తోంది. జనాభాలో దాదాపు 15 శాతం షుగర్ వ్యాధి వ్యాపిస్తోంది. దీంతో చాలా మందిలో మూత్రపిండాల పనితీరు దెబ్బతింటోంది. కొందరు డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కిడ్నీల పనితీరు బాగా పనిచేయాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

షుగర్ పెరిగే ఆహారాలను తీసుకోకుండా ఉండటమే శ్రేయస్కరం. ప్రస్తుత కాలంలో మనం తినే ఆహారాలే మనకు రక్షణగా నిలుస్తున్నాయి. దీని వల్ల మనం మంచి ఆహారాలు తీసుకునేందుకు ప్రాధాన్యం వహించాలి. మూత్రపిండాల పనితీరు సరిగా లేకపోతే మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. ఇవి బాగా పనిచేయాలంటే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు ఉండే ఆహారాలను సూపర్ ఫుడ్స్ గా భావిస్తుంటారు. వీటిని తీసుకుంటే మనకు ప్రయోజనాలు దక్కుతాయి. ప్రొటీన్లు, కేలరీలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న వాటిని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

కిడ్నీల పనితీరు మెరుగుపడాలంటే చేపలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఒమేగా3, కొవ్వు ఆమ్లాలు మనకు ప్రయోజనం కలిగిస్తాయి. సాల్మన్, ట్యూనా వంటి చేపలు తింటే కొవ్వు, ఆమ్లాలు అధికంగా ఉన్న కొవ్వు చేపలను తీసుకోవడం మంచిది. ఒమేగా 3 కొవ్వులు రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తాి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇవి కిడ్నీల పనితీరు మెరుగుపరచడంలో సహకరిస్తాయని వైద్యులు చెబుతున్నారు.

చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల మూత్ర పిండాల వ్యాధులు రాకుండా చేస్తాయని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తేల్చారు. 12 దేశాల్లోని 25 వేల మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు తెలుసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల మంది మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడించారు. చేపల్లో ఉండే లాంగ్ చెయిన్ ఒమేగా ఫ్యాటీ ఆమ్లాల వల్ల గుండెకు మేలు చేస్తాయి. దీనివల్ల కిడ్నీల పనితీరులో క్షీణత రాకుండా నిరోధిస్తాయని గుర్తించారు.

ఈ నేపథ్యంలో చేపలను తరచుగా ఆహారంలో చేర్చుకుని కిడ్నీ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని చెబుతున్నారు. చేపలు జీర్ణం కావడానికి కూడా తక్కువ సమయమే పడుతుంది. మాంసం 76 గంటలు, చికెన్ 32 గంటలు, చేపలు 7 గంటల్లో జీర్ణం అవుతాయి. మటన్, చికెన్ తో పోల్చుకుంటే చేపలు చాలా మంచి ఆహారం. అందుకే వీటిని తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker