చేపలను ఇలా తింటే చాలు, మీ ఆయుష్సు భారీగా పెరుగుతుందంటా..?
ఇప్పుడు బిజీ లైఫ్ కారణంగా తినడానికి కూడా సరైన సమయం ఉండటం లేదు. ఉన్న సమయంలోనే హడావిడిగా ఏదో జంక్ ఫుడ్ లేదా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నారు. దీంతో లేని పోని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. బీపీ, డయాబెటీస్, అధిక బరువు, గుండె జబ్బులు వంటి వాటిని ఎదుర్కొనాల్సి ఉంటుంది. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. సరైన ఆహారం తీసుకోవడం వల్ల మనం కూడా ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.
చేపల్లో పోషకాలు ఉంటాయని మనకు తెలుసు. పోషకాలు అధికంగా ఉండే చిన్న చేపలు క్రమం తప్పకుండా తీసుకుంటే.. మహిళలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని జపనీస్ అధ్యయనం చెబుతోంది. చిన్న చేపలను పాస్తా, సలాడ్స్, శాండ్ విచ్, వంటి వాటిలో చేర్చుకోవాలని చెబుతున్నారు. వాటిని ముళ్లతో సహా తినేయాలని చెబుతోంది. మనలో చాలా మంది గంటల తరబడి టీవీకి అతుక్కుపోతారు.
హార్వర్డ్ యూనివర్సిటీ జరిపిన ఓ అధ్యయనం ప్రకారం ఎక్కువ సమయం టీవీ చూసే మహిళల్లో గుండె జబ్బులు, మధుమేహం, ఆరోగ్యం దెబ్బతినడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపింది.అందరు శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. అతి శుభ్రత వల్ల మనం బట్టలు ఉతకాల్సిన దానికంటే ఎక్కువసార్లు ఉతికేస్తుంటారు. వ్యక్తిగత శుభ్రత పాటించే వారు ఒకసారి వేసుకున్న దుస్తులను పదే పదే ఉతకాల్సిన అవసరం లేదని చామర్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు చెబుతున్నారు.