News

“ఫస్ట్ నైట్” రోజు రీల్స్ చేసిన నూతన దంపతులు, వైరల్ అవుతున్న శోభనం వీడియో.

కొత్తగా పెళ్లయిన జంట ఫస్ట్ నైట్ తర్వాత వీడియో తీసి లీక్ చేసి సోషల్ మీడియాలో ఈ జంటను ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఒక జంట కనిపించింది, వీరిద్దరూ ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే కొందరైతే ఓ అడుగు ముందుకేసి తమ బెడ్‌రూమ్‌ విషయాలను కూడా బయటపెట్టుకుంటున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో చాలా మంది వ్యూస్‌ కోసం ఇలాంటి పనులకు పూనుకుంటున్నారు.

తాజాగా ఓ నూతన జంట కూడా ఇలాంటి పనే చేసింది. తమ తొలిరాత్రి బెడ్‌ రూమ్‌ దృశ్యాలు వీడియో తీశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది. ఆ నూతన దంపతులు తమ ఫస్ట్ నైట్ రోజే వ్లాగ్ చేశారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. నాలుగు గోడల మధ్యన జరగాల్సిన ఫస్ట్ నైట్ విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడమేంటని చీవాట్లు పెడుతున్నారు. మరికొందరు ‘నైస్‌, క్యూట్‌ కపుల్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

‘వ్లాగ్స్ సాంప్రదాయం పెళ్లి నుంచి ఫస్ట్ నైట్ వరకూ చేరిందన్నమాట’ అని కొందరు కామెంట్‌ చేస్తే.. ‘వీళ్ల పిచ్చి పీక్స్‌కు వెళ్లింది’ అని మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ వీడియోలో ఏముందంటే.. ఫోన్ కెమెరా ఆన్ చేసిన భర్త.. భార్య భుజంపై చేయి వేసి ‘హాయ్ ఫ్రెండ్స్.. ఈ రోజు మా ఫస్ట్ నైట్ జరగబోతోంది. మంచాన్ని సువాసన వెదజల్లే పూలతో ఎంతో అందంగా అలంకరించారు’ అని చెప్తాడు. ఆ తర్వాత ఆమెను కూడా మాట్లాడమంటాడు.

ఆమె కూడా కెమెరా ముందు నవ్వుతూ తను చెప్పదల్చుకున్నది చెప్తుంది. ఇలా ఎవరూ చేయని విధంగా ఫస్ట్ నైట్ రోజున వీళ్లు చేసిన వ్లాగ్‌పై నెటిజన్లు విభిన్న స్పందనలు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker